వామ్మో! పెరట్లో సింహం.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్!

Purushottham Vinay
ప్రతి రోజూ లాగానే ఆ వ్యక్తి తన యజమాని ఇంటికి పని నిమిత్తం వెళ్లాడు. అయితే ఆ రోజు యజమాని ఏదో పని మీద బయటకు వెళ్ళింది. దీంతో యధావిధిగానే ముందుగా వెళ్లి ఇంటి గార్డెన్‌లోని మొక్కలకు అతను నీళ్లు పడదామనుకున్నాడు.ఇక అక్కడకు వెళ్లగానే చెట్ల మధ్య నక్కి ఉన్న సింహాన్ని చూసి దెబ్బకు అతను కంగుతిన్నాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేశాడు. ఇక వెంటనే అలెర్టైన్ అధికారులు..ఆ సింహాన్ని బంధించేందుకు అవసరమైన సరంజామాతో అక్కడికి చేరుకున్నారు. చాలా అప్రమత్తంగా ఆ స్థలానికి చేరుకున్న అధికారులకు.. ఆ సింహం అక్కడ కదలకుండా ఇంకా మెదలకుండా ఉండటంతో అనుమానం వచ్చింది. మనుషులు కనిపించినా కానీ దానిలో కదలిక లేదు. ఇక దీంతో దగ్గరకు వెళ్లగా.. అప్పుడు అసలు విషయం తెలిసింది. అది ఓ షాపింగ్ బ్యాగ్ మీదున్న సింహం బొమ్మ అని. ఇక ఆ బ్యాగును చెట్ల మధ్య ఉంచి వెళ్లారు. ఆ సంచిపై ఉన్న సింహం బొమ్మను చూసి.. నిజమైన సింహం అని అనుకోవడంతో.. ఈ తతంగం అంతా  కూడా జరిగింది.


ఇక ఈ ఘటన కెన్యాలోని కిన్యాయా గ్రామంలో జరిగింది. ఆ ఇంటి ఓనరే ఆ బ్యాగ్‌ను చెట్ల పొదల్లో పెట్టారట. అందులో మట్టిని వేసి అవకాడో మొక్కలను పెంచుతున్నారు. ఎండలకు మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు దాన్ని చెట్ల నీడలో ఉంచారట.ఇది అసలు అక్కడి మేటర్.ఆ అటవీ అధికారులు వచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్ అక్కడ లేరు. ఇక విషయం తెలిసి ఓనర్ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, సింహం ఉన్నట్లు ఆమెకు చెప్పి మరోవైపు నుంచి ఇంటి లోపలికి వెళ్లాలని అధికారులు సూచించడం జరిగింది. ఇక ఆమెకు కూడా ఆ బ్యాగ్‌పై ఉన్న సింహం బొమ్మ గురించి ఐడియా రాకపోవడంతో కాసేపు హైటెన్షన్ అనేది నడిచింది. ఇక దాని దగ్గరగా ఉన్న కిటికీలోనుంచి చూడగా సింహం ముఖం తప్ప మిగతా శరీరం అసలు కనిపించలేదు. అప్పుడు అది నిజానికి షాపింగ్ బ్యాగ్ అని తెలిసింది. దీంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: