సింహాచలంలో అపురూప ఘట్టం!

Chakravarthi Kalyan
ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం ఇప్పుడు భక్త జన కోటితో కళకళలాడుతోంది. అందులోనూ సింహాచలానికి ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ప్రఖ్యాత సింహాచల క్షేత్రంలో అపురూప ఘట్టం ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుఝామున.. వైశాఖ శుద్ధ తృతీయ రోజు పూసపాటి వంశస్తులు తొలి చందనం సమర్పణతో స్వామి నిజ రూప దర్శనం ప్రారంభమైంది. భక్తులు కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. రూ.300 నుంచి రూ. 1500 వరకు వేరువేరుగా టిక్కెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.

స్వామి దర్శనం కోసం వచ్చిన వారి కోసం క్యూ లైన్లలో మంచినీరు, మజ్జిగ  పాలు అందించే ఏర్పాట్లు చేశారు. అన్నిచోట్లా సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. భక్తుల కోసం కొండ కింద నుంచి కొండమీదకు బస్ లు ఏర్పాటు చేశారు. ఉదయం 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు  నిజరూప దర్శనం చూసే అవకాశం కల్పించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కొండ పైనున్న క్యూ లైన్ గేట్లు మూసేస్తారు. అప్పటి వరకు క్యూ లైన్ లో ఎంత మంది ఉంటే అంత మందికి దర్శనం జరిగిన తరవాత సహస్ర ఘటాభిషేకం చేస్తారు.

సహస్ర ఘటాభిషేకం తర్వాత స్వామి వారికి నాలుగు మడుగులు చందన పూత పూస్తారు . ఆ సమయంలో సింహాచల అప్పన్న గుమ్మడి పండు ఆకారం లో కనిపిస్తాడు. దీంతో నిజరూప దర్శనం పూర్తి అవుతుంది.  వైశాఖ పౌర్ణమినాడు, జేష్ఠ  పౌర్ణమి నాడు ఆఖరిగా ఆషాడ పౌర్ణమి నాడు నాలుగు మడుగులు చొప్పున మొత్తం 12  మడుగుల చందన పూత స్వామిపై  ఎప్పుడూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఆషాడ పౌర్ణమి నాడు మొత్తం పూర్తి చందనం పూసే రోజు కనుక గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహిస్తారు. ఇలా సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామికి కన్నుల పండువగా జరిగే ఈ చందనోత్సవం ఏటా జరిగే మహోత్సవం. దీన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: