ఎండలతో జాగ్రత్త... అవసరం అయితేనే బయటకు రండి !

VAMSI
ఈ మధ్య ఏదో కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ తో ఎక్కడి జనాలు అక్కడ ఇరుక్కుపోయి, బయటకు వచ్చే దారిలేక వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఆ లాక్ డౌన్ టైం లో వాహనాల వాడకం భారీగా తగ్గింది. దాంతో మునుపెన్నడూ లేని విధంగా వాయు కాలుష్యం తగ్గింది అని వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, ఓజోన్ పొర కూడా ఇపుడు మెరుగు పడుతోందని చాలా వార్తలే వినిపించాయి. దాంతో ఈసారి వేసవి కాలం.. వింటర్ సీజన్ లా చలి గాలులతో తాలకపోయినా కనీసం మండే ఎండలతో ఉడికించదు అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఎప్పటి లాగే ఈ వేసవిలో నువ్వు గంటలు మండిపడుతున్నాయి. సూర్యుడు భగ భగ రగిలిపోతూ తన వేడి కిరణాలతో గుచ్చుతున్నాడు.
న్ని ప్రాంతాలలో అయితే ఉష్ణోగ్రతలు పెట్రోల్ ధరల్లా పెరిగిపోతున్నాయి. దాంతో జనం భానుడి ప్రతాపానికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఏడు దాటితే చాలు బాబోయ్ ఇక బయటకు వెళ్ళడం అవసరమా అన్నట్లుగా మండే ఎండలు భయపెడుతున్నాయి. ఇంకా విధ్యాసంస్థలకు సెలవులు ప్రకటించకపోవడం తో తల్లి తండ్రులు కూడా తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల మొదటి వారం లో వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలోను సూర్యుడు అక్కడ మండుతూ... ఇక్కడా ఎండతో చెమట్లు కక్కిస్తా తగ్గేదే లే..!! అన్నట్లుగా నిప్పులు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ ఎరుగని విధంగా వాతావరణం హాట్ హాట్ గా మారి జనాలను పరుగులు పెట్టిస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు కాకపుట్టిస్తున్నాయి. సూర్యుడి కోపానికి మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఒక వైపు వాతావరణ ఉష్ణోగ్రత  45 డిగ్రీలు దాటుతుండటంతో ఎండలు నిప్పులు చెరుగుతుంటే, మరో వైపు వడగాలులు దుమారం రేపుతున్నాయి. దాంతో జనం ఈ వేసవి సమయంలో ఉక్కిబిక్కిరౌతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న జిల్లా ఆదిలాబాద్ జైనాథ్ లో జనం ఈ ఎండలు కారణంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బేల మండలము చప్రాల 45.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఈ వేడికి తాళలేక ఉమ్మడి జిల్లాలలో వడ దెబ్బతో ముగ్గురు మరణించారు. ఆదిలాబాద్ లో ఒక్కరు , నిర్మల్ జిల్లా భైంసాలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాంతో అధికారులు ప్రజలను అత్యవసరం అయితే బయటకు రావద్దని సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: