కోస్తా : చంద్రబాబు, ఎల్లోమీడియాను జగన్ ఫిక్స్ చేసేశారా ?

Vijaya



ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రివర్స్ ఎటాక్ మొదలుపెట్టేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్లోమీడియా పద్దతిప్రకారం దుష్ప్రచారం చేస్తోంది. జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాల వల్ల ఏపీ తొందరలోనే మరో శ్రీలంక లాగ అయిపోతుందంటు పదే పదే కథనాలు రాస్తోంది. ప్రపంచంలో ఏ దేశం ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా వెంటనే ఏపీకి వాటితో పోలికపెట్టి కథనాలు వండి వారుస్తోంది.



ఈ ప్రచారమంతా చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎల్లోమీడియా చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒంగోలులో బహిరంగసభ జరిగింది. వైఎస్సాఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రు. 1261 కోట్లు జగన్ జమచేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు చంద్రబాబు, ఎల్లోమీడియా, దత్తపుత్రుడిని కలిపి వాయించేశారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, దానిపై చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లోమీడియా కలిసికట్టుగా చేస్తున్న దుష్ర్పచారంపై జగన్ పెద్దఎత్తున మండిపోయారు.



35 నెలల కాలంలో తమ ప్రభుత్వం రు. 1,36,694 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, బీసీ, పేద మహిళల సంక్షేమానికి నిధులు అందిస్తుంటే వాటిని ఆపేయాలన్నట్లుగా ఎల్లోమీడియా ద్వారా చంద్రబాబు కథనాలు పేరుతో బురద చల్లిస్తున్నట్లు ఆరోపించారు. లబ్దిదారులు పథకాలను ఆపేయాలని కోరుకుంటే ఆపటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు. పధకాలు ఆపాలా ? వద్దా ? చెప్పమని జగన్ అడిగినపుడు మహిళలంతా పథకాలు కంటిన్యు చేయాల్సిందే అంటు గట్టిగా నినాదాలిచ్చారు.



అంటే పథకాల అమలుపై నెగిటివ్ గా కథనాలు అచ్చేస్తున్న ఎల్లోమీడియా, వెనకుండి రాయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుపై జగన్ రివర్స్ ఎటాక్ చేసినట్లు అర్ధమవుతోంది. రేపు ఏ కారణం వల్లయినా పథకాలు ఆగిపోతే అది చంద్రబాబు, దత్తపత్రుడు, ఎల్లోమీడియా వల్లే అని జనాలకు అర్ధమైపోతుంది. ఇదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలన్నీ ఆగిపోతాయనే భయాన్ని కల్పించారు. మరి రేపటి ఎన్నికల్లో ఓటర్లేమిచేస్తారో చూడాలి.  







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: