దారుణం.. పసికందుపై పైసాచికత్వం ప్రదర్శించిన కన్న తల్లి!

Purushottham Vinay
ఈ లోకంలో చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడ్డ అమ్మ ఉండదనేది నిర్వివాదాంశం. తనకు లేకపోయినా తన పిల్లలకు పెట్టుకుని అమ్మ పడే సంతోషం అసలు అంతా ఇంతా కాదు. అలాంటి తల్లి ప్రేమకు నిర్వచనమే లేదు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే.అయితే తులసీవనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో ఒక చోట కసాయి తల్లి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితుల ప్రభావమో ఇంకా ఏదో కారణామో కానీ తల్లి ప్రేమ ఇక్కడ కసాయితనంగా మారింది. తన పాపను ముద్దాడుతూ తనివితీరా ప్రేమ నింపే ఆమె పైసాచికంగా మారింది. కడుపులో పెట్టుకుని చూడాల్సిన తొమ్మిది నెలల పసికందుపై తన పైసాచికత్వం ప్రదర్శించింది.ఆ పాపను చెంపలు ఎడాపెడా వాయిస్తూ తన కోపం ప్రదర్శించింది. పాపం ఆ పసికందుకు తన తల్లి ఎందుకు కొడుతుందో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు తనను కొడుతున్నారో తెలియదు.కానీ దెబ్బలకు మాత్రం ఆ పసి కందు ఏడుపు లంకించుకుంది. తన కన్న తల్లే ఇలా చేస్తుందని ఆమెకు ఏం తెలుసు. తన పట్ల ఇంత దారుణంగా వ్యవహరించేంది తన కన్న తల్లి అని పాపకు మాత్రం ఎలా అర్థమవుతుంది.జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల పసికందును తల్లి తన ఒడిలో పట్టుకుని చెంపదెబ్బలు కొడుతుంటే కొందరు చాటుగా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో  షేర్ చేశారు.


దీంతో ఈ కసాయి తల్లి బాగోతం ఏంటో బయటకు వచ్చింది. దీంతో ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు. సదరు మహిళను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.తల్లి ప్రేమ అనేది కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు పక్షుల్లో కూడా ఉంటుంది. జంతువులు కూడా తమ పిల్లలను ఏదైనా పట్టుకోవాలని చూస్తే వెంట పడి మరి తరిమికొడతాయి. తమ పిల్లల సంరక్షణకు అవి అంతగా ప్రాధాన్యం ఇస్తాయి. ఒకవేళ ఎదుటి జంతువు ధాటికి తట్టుకోలేకపోతే అవి తెగ బాధపడతాయి. తమ పిల్లల రక్షణకు శాయిశక్తులా అవి పోరాటం చేస్తాయి. అంతటి మహత్తర శక్తి స్టష్టిలో కేవలం ఒక తల్లికే ఉంటుంది. ఇక అంతటి మహత్తర ప్రేమ కలిగిన మాతృమూర్తి ప్రేమకు తెగులు పట్టిందా? కన్న తల్లి ప్రేమ కర్కశంగా మారిందా? అనే సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: