దారుణం.. కన్నకొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి!

Purushottham Vinay
బెంగళూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో ఓ తండ్రి తన కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.ఆ మంటల్లో కాలుతూ అర్పిత్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అక్కడున్న స్థానికులు మంటలను ఆర్పి అర్పిత్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పాపం అతను మరణించాడు. దీంతో నీచుడైన తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.ఏప్రిల్ 1 వ తేదీన ఆర్థిక లావాదేవీల కారణంగా 51 ఏళ్ల తండ్రి తన కుమారుడిపై పెట్రోల్ పోసి కాల్చిచంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూడటం జరిగింది. అర్పిత్ గురువారం ఉదయం పూట మరణించాడు. పశ్చిమ బెంగళూరులోని చామరాజ్‌పేటలోని వాల్మీకి నగర్‌లో ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దారుణమైన ఘటన జరిగింది.
తండ్రీ కొడుకులు సురేంద్ర కుమార్(బాబు) ఇంకా అర్పిత్‌లుగా పోలీసులుగుర్తించారు. సురేంద్ర కుమార్ అనే వ్యాపారవేత్త తన కుమారుడు అర్పిత్‌కి మధ్య ఆర్థిక విభేదాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత అర్పిత్ బయటకు వెళ్లిపోయాడు. అయితే సురేంద్ర అతడిని వెంబడించి అతనిపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు.ఇక అర్పిత్ తన తండ్రి నిప్పంటించాడని అరుస్తూ రోడ్డుపై పరుగులుపెట్టాడు. అది చూసిన స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అతను 60 శాతం కాలిన గాయాలతో అక్కడే విక్టోరియా ఆసుపత్రిలో చేరాడు.బాబు కన్‌స్ట్రక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేస్తుంటాడని, ఇంకా అర్పిత్ తన తండ్రికి సాయం చేసేవాడని ప్రాథమిక విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా అర్పిత్ నిధుల గురించి సరైన లెక్కలు చెప్పలేదని గొడవలు పడుతూ కొన్ని ఆర్థిక విషయాలపై తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు అనేవి వచ్చాయి. అందుకే అర్పిత్ బిల్డింగ్ నుంచి బయటకు రాగానే అర్పిత్‌పై తన తండ్రి బాబు పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. బాబు పక్కింటిలోని లారీ డ్రైవర్ అంబరీష్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఏప్రిల్ 1న అర్పిత్ బిల్డింగ్ ముందు తన స్నేహితుడితో కబుర్లు చెబుతున్నప్పుడు బాబు నిప్పంటించడం చూశానని అతను చెప్పారు. ఇక అర్పిత్ మృతి విషయం తెలియగానే ఫిర్యాదు చేసినట్లు అంబరీష్ పోలీసులకు తెలిపారు. అంబరీష్ ఫిర్యాదు మేరకు చామరాజ్‌పేట పోలీసులు బాబును అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: