వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు!

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో సొంత నేతలే.. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా.. ఒకరి పై ఒకరు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల టైంలో  తమ నుంచి డబ్బులు తీసుకుని.. తిరిగి ఇవ్వలేదంటూ ఈమధ్య కర్నూలులో ఒక కేసు వెలుగు చూడగా.. ఇప్పుడు ఇలాంటిదే మళ్ళీ రిపీట్ అయ్యి అనంతపురంలోనూ కనిపించింది. జిల్లాలోని కల్యాణదుర్గం మహిళా ఎమ్మెల్యేపై 9వ వార్డు కౌన్సిలర్ అయిన ప్రభావతి తీవ్ర ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ తనవద్ద కోటిన్నర రూపాయల అప్పు తీసుకుని రూ.కోటి మాత్రమే తిరిగిచ్చారని ఆమె ఆరోపించారు. మిగతా డబ్బు అడిగితే మున్సిపల్ కార్యాలయంలోనే దాడికి దిగారని ఇంకా తన అనుచరులతో కలిసి కొట్టబోయారని.. ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో ఇచ్చిన సొమ్మును తిరిగి ఇమ్మని అడిగినందుకు తమ పార్టీ ఎమ్మెల్యే తమపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు.


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ విజయం సాధించారు. అయితే ఈమధ్య జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 9వ వార్డు కౌన్సిలర్ గా ఇదే పార్టీ అభ్యర్థి ప్రభావతి విజయం సాధించారు. గతంలో తాను ఉషశ్రీచరణ్ కి అప్పు ఇచ్చానని ప్రభావతి చెబుతున్నారు.. గత ఎన్నికల టైంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉష శ్రీ చరణ్ కు తాను 1.56 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చానని.. అందులో కోటి రూపాయలు మాత్రమే ఆమె తిరిగి ఇచ్చారన్నారు.ఇక మిగిలిన సొమ్ము అడిగినందుకు ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించి దాడులు చేయిస్తున్నారని ప్రభావతి ఆరోపించారు. ఉదయం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లి కౌన్సిలర్ ప్రభావతి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంకా అలాగే వైసీపీ నేతలు సర్దిచెప్పి అక్కడి నుంచి ఆమెను వెనక్కి పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: