ఆ వైసీపీ మంత్రికి.. నాగబాబు చురకలు?

Chakravarthi Kalyan
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వైసీపీ మంత్రి కన్నబాబుకు చురకలు వేశారు. రాష్ట్రంలో వ్యవసాయం బాగుందని, రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలకు షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ ఉందని అందుకే  ఇచ్చిన హామీలను మర్చిపోయారని  నాగబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ సెటైర్లు వేశారు.

నాగబాబు ఇలా కన్నబాబును టార్గెట్ చేసుకోవడానికి కారణం ఉంది. కన్నబాబు నాగబాబు, పవన్ కల్యాణ్‌ లకు చాలా దగ్గర.. గతంలో ప్రజారాజ్యంలో కూడా కన్నబాబు చేరారు.. ఓ జర్నలిస్టుగా ఉన్న కన్నబాబును రాజకీయ నాయకుడిని చేసింది మెగా ఫ్యామిలీయే.. ప్రజారాజ్యం పార్టీలో చేరిన కన్నబాబు.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా నాయకుడిగా నిలబడ్డారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. ఏకంగా మంత్రి అయ్యారు.

కన్నబాబు మంత్రి అయ్యాక.. రాజకీయ పరంగా పవన్ కల్యాణ్‌ ను విమర్శించాల్సి వస్తుంటుంది. అది నాగబాబుకు కోపం తెప్పిస్తోంది. అందుకే చాన్స్ దొరకగానే చురకలు వేశారు. ఇదే సమయంలో నాగబాబు జగన్ పైనా విరుచుకుపడ్డారు. ఓవైపు  కల్తీ సారా మరణాల పై ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. కల్తీ సారా వల్లే తమ వారు మరణించారని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం అబద్దాలు చెబుతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగబాబు అన్నారు.

జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ని తాను సోదరునిగా కాకుండా పార్టీ అధ్యక్షుడిగానే చూస్తున్నానని.. రైతుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమానికి తన వంతుగా పది లక్షలు అందిస్తున్నానని నాగబాబు తెలిపారు. మొత్తానికి నాగబాబు కూడా క్రమంగా రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. జనసేన కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: