నా ఆస్తులన్నీ రాహుల్ గాంధీకే?

praveen
కేవలం సినీ సెలబ్రిటీలకూ మాత్రమే కాదు  రాజకీయ నాయకులకు కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తమ అభిమాన రాజకీయ నాయకుడు పై తమకు ఉన్న ప్రేమ అభిమానం వినూత్నంగా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక 78 ఏళ్ల బామ్మ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. 78 ఏళ్ల బామ్మకు అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం. ఈ క్రమంలోనే ఇటీవల ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఆ భామ్మా. ఆస్తులన్నీ రాహుల్ గాంధీకీ అంకితం ఇస్తున్నాను అంటూ చెప్పేసింది.

 ఉత్తరాఖండ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్కు చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప ముంజయల్  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అమితంగా అభిమానిస్తా ఉంటుంది. అయితే ఇక దేశానికి రాహుల్ గాంధీ అవసరం ఎంతగానో ఉంది అంటూ సదరు చెబుతుండటం గమనార్హం. తన పేరుమీద ఉన్న 50 లక్షల విలువైన ఆస్తులు 10 తులాల బంగారం రాహుల్కు చెందేలా వీలునామా రాయడం సంచలనంగా మారిపోయింది. పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన సదరు బామ్మ రాహుల్ పేరు పైన తన ఆస్తులను  బదలాయిస్తున్నట్లు వీలునామా రాసి ఆయనకు అందజేసింది.

 ఇక ఈ వీలునామాన్ని అటు కోర్టులో కూడా సమర్పించడం గమనార్హం. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎన్నో త్యాగాలు చేసింది అంటూ సదరు బామ్మ చెబుతోంది. ఇక రాహుల్ గాంధీ అభిప్రాయాలు సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరమని తెలిపింది. మరణానంతరం తన ఆస్తులని రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశానని ఇక ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పినట్లు చెప్పుకొచ్చింది 78 ఏళ్ల పుష్పా ముంజయల్. ఇక ఈ బామ్మ తీసుకున్న నిర్ణయంపై ఎంతోమంది షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: