వంట నూనెతో.. గాల్లోకి ఎగిరిన విమానం.. ఇది అద్భుతమే?

praveen
సాధారణంగా విమానం ఎలా నడుస్తుంది అన్నది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కార్లు బస్సులు నడిచినట్టుగా పెట్రోల్ డీజిల్ తో కాదు ప్రత్యేకమైన ఇంధనంతో అటు విమానం నడుస్తూ ఉంటుంది.ఇక ఈ ఇందనం ఎంతో ఖర్చుతో కూడుకున్నది అన్న విషయం తెలిసిందే. అందుకే విమాన టికెట్ ధరలు కూడా భారీగా ఉంటాయి. అయితే ఇలా ఇంధనంతో అటు గాల్లోకి ఎగిరిన విమానాల గురించి దాదాపు అందరికి తెలుసు.. కానీ ఇక్కడ మాత్రం ఒక వినూత్నమైన ఆవిష్కరణ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేటి రోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అని ఎంతోమంది ఎన్నో రకాల వినూత్నమైన ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఎప్పుడు జరిగే విషయాలలోనే కాస్త కొత్తదనాన్ని జోడించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఒక విమానం ఏకంగా ఇందనం లేకుండానే గాలిలోకి ఎగిరింది. రయ్ రయ్యిమంటూ దూసుకుకోవడమే కాదు ఆ తర్వాత ఎంతో సేఫ్ ల్యాండ్ అయ్యింది. అదేంటి ఇందనం లేకుండా విమానం గాల్లోకి ఎగరడం ఏంటి అది ఎలా సాధ్యం అవుతుంది అని ఆలోచనలో పడిపోయాడు కదా. మరి ఎలా సాధ్యమయిందో చెబితే మాత్రం తప్పకుండా అవాక్కవుతారు అని చెప్పాలి..

 ఏకంగా విమానంలో తరచూ వాడే ఇంధనం కి బదులుగా ఏకంగా వంటనూనె ఇంధనంగా నింపుకొని ఆకాశంలోకి ఎగిరింది ఇటీవలే ఒక విమానం. అంతే కాదు ఎంతో విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానయాన రంగంలో ఇది ఒక సంచలన మలుపు అన్నది నిపుణులు చెబుతున్న మాట. ఎయిర్బస్ సంస్థకు చెందిన ఏ 380 అనే విమానం  వంటనూనెలు ఇంధనంగా నింపుకుంది. ఈ క్రమంలోనే తొలి ప్రయాణాన్ని ఎంతో విజయవంతంగా ముగిసింది. ఫ్రాన్స్ లోని టౌన్స్ బ్లాక్ నుంచి వంట నూనెతో తయారు చేసిన 27 టన్నుల సస్టైనబుల్ విమాన ఇంధనం నింపుకున్న విమానం ఏకంగా 27 నిమిషాల పాటు ప్రయాణించి ఇక ఆ తర్వాత ఎంతో సేఫ్ గా ల్యాండ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: