మంత్రి పదవిపై రోజాకు దొరకని హామీ..

Deekshitha Reddy
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా కోటాలో రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ అప్పట్లో ఆమెను మంత్రి మండలిలోకి తీసుకోలేదు జగన్. ఆ టైమ్ లో రోజా బాధ పడ్డారు కూడా. కంటి తుడుపుగా ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చినా, ఆ తర్వాత అదీ లేదు. ప్రస్తుతం రోజా కేవలం ఎమ్మెల్యే మాత్రమే. అయితే ఆమెకు మంత్రి పదవి యోగం ఉందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది. రోజా ప్రస్తుతం గుడులు, గోపురాల చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలే దీనికి నిదర్శనం అంటున్నారు.
మంత్రి పదవిపై గట్టి హామీ లభించినవారెవరూ మీడియా ముందు నోరు మెదపడంలేదు. మరోవైపు రోజా మాత్రం నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి వచ్చారు. అసంబ్లీలో కూడా జగన్ ని ఓ రేంజ్ లో పొగడ్తల్లో ముంచెత్తారు. ఇంత చేసినా ఆమెకు ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.
రోజా ఇటీవల ఏపీ, తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగొస్తున్నారు. నియోజకవర్గాల్లో చురుగ్గా ఉంటూనే.. ఇలా గుడులు, గోపురాలంటూ టూర్లు వేస్తున్నారు. ఏ దేవుడైనా కరుణించి జగనన్నకు తన గురించి సిఫారసు చేస్తాడేమోననేది రోజా ఆశ. అయితే సొంత జిల్లాలోనే ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి పెద్ద అడ్డంకిగా మారారనే ప్రచారం ఉంది. చిత్తూరు జిల్లాలనుంచి మంత్రి పెద్దిరెడ్డిని మంత్రి మండలిలో కొనసాగించే అవకాశం ఉండటంతో.. రోజాకు స్థానం దక్కదని అంటున్నారు. పోనీ రోజాను కొత్తగా ఏర్పడే బాలాజీ జిల్లా కింద పరిగణించినా, అక్కడ కూడా తన మాట నెగ్గించుకునేందుకు పెద్దిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. దీంతో ఈసారి కూడా రోజాకు మొండి చేయి చూపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
రోజా శ్రమకు ఫలితం ఎప్పుడు..?
గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆమెకు పెద్దగా ప్రయోజనం లేదు. పలు దఫాలు రోజా ఇదే విషయంపై మీడియా ముందు కూడా బాధపడ్డారు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చాక కూడా రోజా పదవి లేకుండా కేవలం ఎమ్మెల్యేగానే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం బి-టీమ్ ని రెడీ చేస్తున్న జగన్, ఇందులో అయినా రోజాకి అవకాశమిస్తారో లేదో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: