అమరావతి : కొత్త మంత్రులకు అసలైన సినిమా తప్పదా ?

Vijaya



తొందరలో కొలువుదీరబోయే మంత్రులకు చాలా పెద్ద బాధ్యతలే ఉంటాయని టాక్. షెడ్యూల్ ఎన్నికలకు ఇక రెండేళ్ళే సమయం ఉంది. అందులోను ఇప్పటికే ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. ఈ సమయంలో కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న మంత్రులపై జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద బాధ్యతలనే మోపబోతున్నారట. అందుకనే కసరత్తు విషయంలో ఇంత సమయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.



ఇంతకీ జగన్ మోపబోతున్న పెద్ద బాధ్యతలు ఏమిటోతెలుసా ? రెండేళ్ళ కాలంలో పార్టీని పటిష్టం చేయటం. మంత్రులు ఇటు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతునే అటు పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యతలు కూడా కొత్త మంత్రులపైనే ఉంటుంది. మామూలుగా జనాల ఆలోచనలు ఎలాగుంటాయంటే ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేశాము, ఎంత అభివృద్ధి చేశాము అని ప్రభుత్వం చెబితే పట్టించుకోరు. ఎప్పటి లెక్క అప్పుడు సరిచేయాల్సిందే. అందుకనే మంత్రులు వాటన్నింటికీ ఇప్పటి నుండే సిద్ధపడాల్సుంటుంది. ఒకవేళ ఇందులో మంత్రులెవరైనా ఫెయిలైతే అంతే సంగతులు. మళ్ళీ అధికారంలోకి వచ్చినపుడు ఇవన్నీ మైనస్ అయితే జగన్ నుండి ఇబ్బందులు తప్పవు.



ఎన్నికల సమయంలో మాకేంటి ? అనేదే కీలకమవుతుంది. అందుకనే ఎన్నికలకు రెండేళ్ల ముందు మంత్రులుగా బాధ్యతలు తీసుకునే వాళ్ళపని కత్తిమీద సాములాంటిదే.  ఏదో మంత్రిపదవిలోని సుఖాన్ని అనుభవించేసి, ప్రోటోకాల్ ను అనుభవించేద్దామని అనుకుంటు కుదరదు. పార్టీలోనే ఉండాలి, మంచి భవిష్యత్తుండాలని అనుకునే మంత్రులు 24 గంటలూ కష్టపడాల్సింది తప్ప వేరే దారిలేదు. పైగా ప్రతి మంత్రి పనితీరును జగన్ వ్యక్తిగతంగా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు.



ఎందుకంటే మంత్రుల పనితీరు మీద జనాల్లో అసంతృప్తి వచ్చిందంటే అది రేపటి ఎన్నికలపైనే ప్రభావం చూపుతుంది. అందుకనే పైనుండి అందరినీ స్కాన్ చేస్తునే ఉంటారు. ఇటు ఎంఎల్ఏలతోను అటు పార్టీ నేతలతోను సమన్వయం చేసుకుంటునే ఎప్పుడూ జనాలతోనే మంత్రులుండాల్సుంటుంది. పార్టీ వర్గాలు చెప్పేదాని ప్రకారం కొత్తమంత్రులకు ముందుంది అసలైన సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: