వండర్‌ఫుల్‌ : ఆ ఉద్యోగులకు సెలవులు పెరుగుతున్నాయ్‌?

Chakravarthi Kalyan
ఇది నిజంగా ఆ ఉద్యోగులకు శుభవార్తే.. దేశంలో అందరికంటే తక్కువ సెలవులు ఉండే ప్రభుత్వ ఉద్యోగులు సైనికులే కావచ్చు. ప్రత్యేకించి సాయుధ బలగాల్లో పని చేసేవారికి సెలవులు తక్కువ. దీనికి తోడు వారు కుటుంబాలను వదిలేసి చాలా దూరంలో విధులు నిర్వహిస్తుంటారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్.. కేంద్ర సాయుధ బలగాలు వారి కుటుంబాలతో గడిపేందుకు ఇకపై ఏడాదికి 100 రోజులు సెలవు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తోంది. గతంలోనే ప్రతిపాదించిన ఈ  100 రోజుల సెలవుల ప్రతిపాదనలు త్వరలోనే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిదే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్వంలోని అన్ని విభాగాలకు చెందిన  10లక్షల మంది బలగాలకు ప్రయోజనం కలుగుతుందని ఓ అంచనా. ఈ ప్రతిపాదనలపై మీ అభిప్రాయం చెప్పాలని ఇప్పటికే అన్ని కేంద్ర సాయుధ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసిందట. ఈ 100 రోజుల సెలవులకు సంబంధించి ఆ విభాగాధిపతుల సూచనలను కేంద్రం ఇప్పటికే కోరందట. ఈ సమాధానాలు వస్తే.. వాటి ఆధారంగా వచ్చే నెలలో బలగాల 100 రోజుల సెలవుపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర సాయుధ బలగాలంటే.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య పని చేస్తుంటారు. సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతోనే  ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనను 2019 అక్టోబరులో  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు. దీని అమలు కోసం ఓ సాఫ్ట్ వేర్‌ రూపొందించాలని కూడా నిర్ణయించారు.

తాజాగా ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ.. కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన గురించి ఆలోచిస్తోంది. ప్రస్తుతం జవాన్లకు ఏడాదికి 60 నుంచి 65 రోజుల సెలవులు ఇస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే మరో 35 నుంచి 40 రోజులు సెలవులు పెరుగుతాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: