తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన ?
ఇప్పటి వరకు 600 కోట్ల ఖర్చుతో 45లక్షల సెషన్లు నిర్వహించి, డయాలసిస్ సేవలు అందించామన్నారు హరీష్ రావు. సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ సిస్టంను దేశంలోనే తొలిసారిగా మనం ప్రారంభించుకున్నామని చెప్పారు హరీష్ రావు.
ఈ విషయంలో తెలంగాణను తమిళనాడు మనల్ని ఆదర్శంగా తీసుకున్నదన్నారు హరీష్ రావు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మొత్తంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ప్రజారోగ్యం కోసం రూ. 11,237 కోట్లు కేటాయించడం జరిగిందని వెల్లడించారు హరీష్ రావు. బడ్జెట్ కేటాయింపులతో పాటు మొత్తం 80,039 పోస్టుల భర్తీలో 12,755 ఉద్యోగాలు ఆరోగ్య శాఖలో భర్తీ చేసుకోబోతున్నామని పేర్కొన్నారు హరీష్ రావు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగమిస్తున్నది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదన్నారు హరీష్ రావు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని వెల్లడించారు హరీష్ రావు. మనం తాజాగా పెట్టుకున్న బడ్జెట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వ తలసరి వైద్య ఖర్చు రూ. 3,092కు చేరుకుందన్నారు హరీష్ రావు.
-కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి నాంది పలికారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు కాకున్నా, సొంత ఖర్చులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు.