ఏపీకి కొత్త మంత్రుల ఎంపిక...అప్పుడే?

VAMSI
ఏపి రాజకీయంలో మరో కీలక చర్చ మొదలయ్యింది. మంత్రుల్లో మతలబు ఏదో నడుస్తోంది. ఎవరు ఉంటారు ఎవరు మారుతారో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కు ప్రణాళిక సిద్దం అయినట్లు సమాచారం. సిఎం దగ్గరుండి మరో మంత్రుల లెక్క తేల్చి సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేనండి సిఎం జగన్ మొదటి నుండి చెప్పింది చెప్పినట్టు చేసుకు పోతున్నారు. కాగా ఇపుడు ఇదే తరహాలో ఆయన మొదట్లో ... రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని అన్న మాట గుర్తుండే ఉంటుంది. అయితే ఇపుడు అందుకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.
దాంతో ఏపి రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. మంత్రులు తమ సీట్లు ఇక తమకు లేనట్టేనా? అంటూ కంగారుపడుతున్నారు అంటూ గుస గుసలు వినపడుతున్నాయి. 2022 ఏప్రిల్‌ 11 న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ అంశం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కొందరు మంత్రులు మినహా మిగిలిన వారిని చేంజ్ చేయడానికి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి మిగిలిన మంత్రుల పదవులకు గ్యారంటీ లేనట్టే అంటున్నారు .
అయితే కొత్తగా పదవి లోకి చేరనున్న ఆ మంత్రులు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. మరో వైపు మిగిలిన మంత్రులందరూ తమ తమ పదవులను కాపాడుకోవటానికి గట్టి గానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొందరి పేర్లు రాజకీయ వర్గాల్లో మారు మ్రోగుతున్నాయి. మరి కొత్తగా ఎన్నిక కాబోయే మంత్రులలో ఎవరి పేర్లు ఉండనున్నాయి ? ఎవరు ఉద్వాసనకు గురి కానున్నారో ? అన్న పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: