పవన్ చూపు ఈస్ట్ గోదావరి వైపు!

Purushottham Vinay
పవన్ కళ్యాణ్ చూపు ఈస్ట్ గోదావరి జిల్లా మీద పడింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పోటీకి దిగుతారు అన్నది జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వెస్ట్ గోదావరి విశాఖల నుంచి రెండు సీట్లను ఎంపిక చేసుకుని మరీ పోటీకి దిగారు. వెస్ట్ గోదావరిలో ఆయన భీమవరం నుంచి విశాఖలో గాజువాక నుంచి పోటీ చేస్తే రెండు చోట్లా కూడా ఓటమి పాలు అయ్యారు.దాంతో ఈసారి ఒకే ఒక సీటు నుంచి పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం తెలుస్తోంది. జనాలకు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే చోట నుంచి బరిలోకి దిగితే విజయం ఖాయమన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు.ఇక  ఈస్ట్ గోదావరి జిల్లాలలో చాలా సీట్లలో కాపుల ప్రాబల్యం అనేది ఉంది. అక్కడ గతంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం కూడా నాలుగు సీట్లను గెలుచుకుంది. చాలా చోట్ల గట్టి పోటీ కూడా ఇచ్చింది. ఇక జనసేన పార్టీ నుంచి గనుక చూస్తే 2019 ఎన్నికల్లో కూడా ఓడిపోయినా చాలా నియోజకవర్గాలలో మంచి సంఖ్యలో ఓట్లను సంపాదించుకుంది.దాంతో బలమైన సామాజికవర్గం జనసేన పార్టీ వైపు ఉందని అర్ధమవుతోంది.


దాంతో ఈ జిల్లాలో 19 సీట్లలో ప్రభావం చూపించాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తే బాగుంటుంది అని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయట. ఈ విషయాలను పూర్తిగా అధ్యయనం చేసిన పవన్ తాను రెండు సీట్లను ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నారని అందులో ఒకదాని నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.పవన్ కళ్యాణ్ ఎంచుకున్న రెండు సీట్లలో ఒకటి కాకినాడ రూరల్. ఇది జనసేన పార్టీకి స్ట్రాంగ్ అవుతుందని భావిస్తున్నారు. 2019 ఎలక్షన్స్ లో ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు. అయితే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పంతం నానాజీ ఏకంగా నలభై వేల ఓట్లను తెచ్చుకోవడం అనేది విశేషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 65 వేల ఓట్లు తెచ్చుకుంటే కన్నబాబుకు 74 వేల ఓట్లు వచ్చాయి.మరి ఇక్కడ పొత్తు కనుక తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటే వైసీపీ ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడుతుంది అన్న లెక్కలు ఉన్నాయట. దాంతో పవన్ కళ్యాణ్ ఈ సీటు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు అని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: