అమరావతి : అందరినీ టెన్షన్ పెట్టేస్తున్న జగన్

Vijaya


అసెంబ్లీ సమావేశాలను జగన్మోహన్ రెడ్డి చక్కగా వాడుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణకు సంబంధించి పెద్ద కసరత్తే చేసినట్లున్నారు. మంత్రివర్గం నుండి డ్రాప్ చేయాల్సిన వాళ్ళని, మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్న వాళ్ళని కూడా పిలిపించుకుని మరీ మాట్లాడారట. ఈ నేపధ్యంలోనే కొందరిపై ఆగ్రహం, మరికొందరికి క్లాసులు పీకటం, ఇంకొందరికి సుతిమెత్తగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం.




అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఎంఎల్ఏలను పిలిచి ఫుల్లుగా క్లాసులు పీకారట. ప్రతిపక్షంలోని సీనియర్ నేతలతో కలిసి ఏదో దందా చేసిన విషయంలో ఒక సీనియర్ ఎంఎల్ఏని జగన్ నిలదీశారట. పనిలోపనిగా మరో జూనియర్ ఎంఎల్ఏని పిలిపించుకుని ఆయన వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారట. సృతిమించిపోయిన సెటిల్మెంట్ల విషయాన్ని ప్రస్తావించటంతో సదరు ఎంఎల్ఏ షాక్ తిన్నారట.




అలాగే కృష్ణా జిల్లాలోని ఓ సీనియర్ ఎంఎల్ఏ పనితీరుపై జగన్ పెదవి విరిచారట. పిలిపించుకుని మరీ చిన్నపాటి క్లాసు పీకారని సమాచారం. నియోజకవర్గంలో పనితీరు ఏమీ బావోలేదన్నారు. పక్క నియోజకవర్గాల్లో కూడా పార్టీని గెలిపించుకు రావాల్సినంత సీనియారిటి పెట్టుకుని సొంత నియోజకవర్గంలోనే పనితీరు బాగాలేకపోతే ఎలాగంటు నిలదీశారట. దాంతో సదరు ఎంఎల్ఏకి ఏమి చెప్పాలో అర్ధంకాలేదట. ఇక రాయలసీమలోని మరో జిల్లా సీనియర్ ఎంఎల్ఏ పనితీరు విషయంలో కూడా జగన్ తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ఎంఎల్ఏని పిలిపించుకుని మరీ క్లాసు పీకారట.  రాయలసీమకు చెందిన ఒక మంత్రికి కూడా ఫుల్లుగా క్లాసు పడిందట.



ఈ విధంగా కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి 70 మంది పనితీరుపై జగన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రివ్యు చేశారు. వీరిలో మంత్రివర్గం నుండి పక్కకు తప్పించేవారున్నారు. అలాగే పనితీరు ఆధారంగా మంత్రవర్గంలోకి తీసుకోవాలని అనుకున్నవారు కూడా ఉన్నారట. మరికొందరిని మంత్రివర్గంలో కంటిన్యుచేయాలని అనుకున్నవారు కూడా ఉన్నారట. మొత్తంమీద తనకు దొరికిన సమయాన్ని రివ్యులతో  జగన్ చక్కగా ఉపయోగించుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరి తర్వాత కూడా ఇదే కసరత్తు కంటిన్యు చేస్తారా లేదా అన్న విషయం చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: