యాదాద్రిలో మరో కీలక ఘట్టం ?

Veldandi Saikiran
శిల్ప శోభితం, దేవనగరి యాదాద్రి ఆలయం. ఆధ్యాత్మిక ఆలయాలంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం, భద్రాద్రి శ్రీరాముల వారి ఆలయం. ఇప్పుడు వాటి సరసన యాదాద్రి చేరింది. తెలంగాణ ఆధ్యాత్మికానికే తలమానికంగా మారింది యాదాద్రి. అలాంటి యాదాద్రి నారసింహుడి పునరుద్ఘాటన సందర్భంగా.... టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి వినూత్న పద్ధతిలో భక్తి శ్రద్దలతో యాదాద్రి వైభవాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగా సతీష్ రెడ్డి సొంత గ్రామమైన ములుగు జిల్లా దేవగిరి పట్టణంలో గ్రామంలో లడ్డూల వితరణ చేశారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి  స్వామి వారి కళ్యాణం లడ్డూ ప్రసాదం, యాదాద్రి విశిష్టత, శిల్పా సౌందర్యం గురించి వివరిస్తూ, కట్టడాలు, గోపురాలు, ఆలయ పునర్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో 20 పేజీల బ్రోచర్, స్టిక్కర్ తో ఒక పేపర్ బ్యాగ్ లో కిట్ రూపంలో ప్రతీ ఇంటికి అందించారు. ఊర్లో ఉన్న ప్రతీ కుటుంబానికి స్వామివారి ప్రసాదాలను అందించారు. అలాగే ప్రతీ ఒక్కరు మన తెలంగాణ ఆధ్యాత్మిక తలమానికమైన యాదాద్రి నారసింహుడిని దర్శించుకోవాలని కోరారు. ఆలయ పున: ప్రారంభం తర్వాత ఊరి నుంచి స్పెషల్ బస్సులేసి దాదాపు ఒక ఐదు వందల మందికి యాదాద్రి దర్శనం చేపిస్తానని అన్నారు. అలాగే తెలంగాణలోని ప్రతీ కుటుంబం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరు దర్శించుకోవాల్సిన గొప్ప దైవ క్షేత్రం మన యాదాద్రి అన్నారు. మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కు చెప్పి ప్రతీ ఊరి నుంచి, ప్రతీ మండలం నుంచి దర్శించుకొని యాదాద్రి వైభవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాల్సిన అవసరమున్నది.
ఈ సందర్భంగా వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.... నాటి రామదాసు భద్రాద్రి నిర్మించినట్లే... మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో యాదాద్రి ఆలయ పునర్మిణాన్ని చేపట్టి విజయవంతం చేశారని అన్నారు. స్వయానా ఆ యాదగిరి నారసింహుడి ఆశిస్సులతోనే, స్వామివారి కృపతోనే కేసీఆర్ చేత ఉద్యమం చేపించి, తెలంగాణ తెప్పించి, రాష్ట్ర నాయకుడిగా తన ఆలయాన్ని పునర్ నిర్మాణం చేయించుకున్నారని అన్నారు.  
ఒకనాటి పాతగుట్ట నరసింహ స్వామి పాత ఆలయం ఎందరో భక్తజనుల తీర్థ యాత్రాస్థలిగా విరాజిల్లింది. నేడు అది యాదాద్రి నవ నారసింహ క్షేత్రమై భక్తకోటిని అలరించబోతున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, సుందరమైన ఆధ్యాత్మిక నగరిగా శోభిళ్లనుంది. సుమారు రూజ 2 వేల కోట్ల వ్యయంతో యాదాద్రి ఆలయాన్ని పునర్మించేందుకు సంకల్పించారు సీఎం కేసీఆర్. వారి సంకల్పంతో హృదయంగమైన దేవస్థానంగా తీర్చిదిద్దబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: