జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటే.. రేవంత్ కు తిరుగులేనట్టే..!

MOHAN BABU
 దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలు అనేవి ఏమి కొత్తకాదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలు వార్తల్లో నిలుస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్వతంత్ర పార్టీ అని చెప్పవచ్చు. అందుకే ఇలాంటి పరిణామాలు తరచూ జరుగుతూ ఉంటాయి. అక్కడ గల్లీ లీడర్ అయినా సరే ఢిల్లీ నాయకులను గట్టిగా ప్రశ్నించే అవకాశం కల్పిస్తారు. ఇలా ఎవరికి వారు విమర్శలు చేసుకుంటూ అసమ్మతితో బుసలు కొడుతూ ఉంటారు.

 తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  అసమ్మతి సెగలు కక్కుతున్నారు. టిపిసిసి  చీప్ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడుతూ, రేవంత్ రెడ్డితోనే నా పంచాయతీ అంటూ బహిరంగంగానే ప్రకటన  చేశారు. తనకు కాంగ్రెస్ అధినాయకత్వం అయినా రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ పై నమ్మకం ఉందని పార్టీని వీడే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నిజానికి జగ్గారెడ్డి ని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి తప్పించడంతో పాటుగా ఇతర బాధ్యతల నుంచి తొలగించారు. దీంతో ఆయన పార్టీని వీడుతారని అందరూ భవించారు. కానీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం దీనికి విభిన్నంగా స్పందించారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించడంతో పాటుగా నాకు రేవంత్ రెడ్డి తోనే గొడవ అని కామెంట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కొరకరాని కొయ్యగా మారబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వివాదం ఢిల్లీకి చేరడంతో ఆయనకు ఉన్నటువంటి అన్ని పదవుల నుండి తప్పించింది తెలంగాణ కాంగ్రెస్.

అయితే ఆయనను కట్టడి చేయడం  తెలంగాణ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కాదు. ఢిల్లీ అధిష్టానం నాయకులకు మాత్రమే ఆయనను ఆపగలిగే శక్తి ఉంటుంది. మరి జగ్గారెడ్డి స్పీడుకు కాంగ్రెస్ అధినాయకత్వం బ్రేకులు వేస్తుందా లేదా అన్న సందేహం అందరిలో నెలకొని ఉంది. ఒకవేళ జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికి ఇక హైకమాండ్ నుంచి  తిరుగు లేదని చెప్పవచ్చు. జగ్గారెడ్డి తెలంగాణలో మంట పెట్టి ఢిల్లీ  అధిష్టానంపై ప్రేమ చూపిస్తుంటే అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: