తెనాలి నాదెండ్లకు..ఆలపాటి పొజిషన్ ఏంటి?

M N Amaleswara rao
టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని చెప్పొచ్చు...ఇప్పుడే అధికారికంగా ప్రకటన రాకపోవచ్చు గాని...నెక్స్ట్ ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది..టీడీపీ-జనసేన కలిస్తేనే వైసీపీకి చెక్ పెట్టొచ్చని చెప్పొచ్చు..అందుకే ఆ రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. అయితే ఈ పొత్తు అంశం గురించి అధికారికంగా ఎలాంటి చర్చలు జరగడం లేదు...అలాగే సీట్ల విషయం గురించి చర్చలు లేవు..కానీ అనధికారికంగా సీట్ల విషయంలో రకరకాల చర్చలు వస్తున్నాయి.


అలాగే మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి...జనసేనకు అన్ని సీట్లు ఇవ్వొచ్చు...ఇన్ని సీట్లు ఇవ్వొచ్చు అని ప్రచారం జరుగుతుంది...అటు బీజేపీ కలిస్తే..ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు రావొచ్చని కథనాలు వస్తున్నాయి...ఇవన్నీ పూర్తిగా కథనాలు మాత్రమే...వీటిల్లో నిజమెంత ఉందనేది భవిష్యత్‌లో తెలుస్తోంది...అలా కథనాలు వస్తున్న వాటిల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి సీటు గురించి కూడా సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది.
మామూలుగా తెనాలి టీడీపీ కంచుకోట..ఆ పార్టీ పలుమార్లు తెనాలిలో సత్తా చాటింది..ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సీనియర్ నేత ఆలపాటి రాజా ఓడిపోయారు..ఇప్పటికీ అక్కడ రాజా పార్టీ కోసం పనిచేస్తున్నారు...అలాగే ఆయన చాలావరకు బలపడ్డారు...పైగా అమరావతి అంశం ఆయనకు బాగా ప్లస్ అవుతుంది. చెప్పాలంటే నెక్స్ట్ ఆలపాటి గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
కానీ తాజాగా పొత్తు అంశంతో తెనాలి సీటు విషయంలో ఇబ్బంది మొదలైంది...టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..తెనాలి సీటు జనసేనకు దక్కుతుందని, అక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది..అంటే తెనాలి సీటు ఆలపాటికి దక్కదని అంటున్నారు. అయితే పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉండేలా ఉంది..అదే జరిగితే తెనాలి సీటు నాదెండ్లకు ఇస్తే..ఆలపాటికి వేరే రూట్ చూపించాలి...ఎమ్మెల్సే లేదా వేరే సీటు ఇవ్వాలి. గుంటూరు వెస్ట్ సీటు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఆలపాటికి తెనాలి సీటు ఇస్తే..నాదెండ్లకు వేరే సీటు కేటాయించాలి. మరి తెనాలి సీటు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: