పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్... ?

VAMSI
ప్రజలకు రాజకీయ రంగం ఎప్పుడూ హాట్ టాపిక్కే, తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయం ఎపుడు కాకమీద ఉంటుంది. ఇపుడైతే ఆంధ్రలో రాజకీయ రంగం బాగా వేడి మీద ఉంది. తాజాగా ఏపీలోని మరో పొలిటికల్ న్యూస్ వైరల్ గా మారింది. అధికార పార్టీపై ప్రముఖ ప్రత్యర్ధి పార్టీ టిడిపి ఎపుడు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతూనే ఉంటుంది. కాగా ఇపుడు మరోసారి వైసిపి పై నిప్పులు చెరిగారు టిడిపి నేత. అమరావతిలో రాజకీయ రంగం మరోసారి భగ్గుమంది. అధికార పార్టీ నేతల వైఖరిని విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్. అధికార పార్టీ ఇస్తున్న అలుసుతో పోలీసులు వ్యవహారం ముదిరి పోతోందని ఆయన మండిపడ్డారు.
అయితే  వైసిపి పార్టీ అధికారం లోకి వచ్చింది మొదలు పోలీసుల అధికార జోరు బాగా పెరిగిందని, వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న మాటలు వినపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వంపై వస్తున్న పలు వ్యతిరేకతలలో ఇదే ముఖ్యమైనదని కొన్ని వర్గాలు చెబుతున్న మాట.  కాగా ఇపుడు ఇదే విషయం పై మరో సారి ఏపి సర్కారు పై మండిపడ్డారు పరిటాల. ఉత్తిపుణ్యానికే టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు వైసీపీ నాయకులూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ద్వారా టీడీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకు తోడుగా తానా అంటే తందానా అంటూ వారు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.  మా తప్పులేకున్నా కావాలని పనిగట్టుకుని మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే సునాయాసంగా అరెస్టులు చేస్తూ ఉంటే ప్రవేటు కేసు పెడతాం అంటూ ఫైర్ అయ్యారు.  దళితులకు అన్యాయాలు , దోపిడీలు ,దౌర్జన్యాలు, స్వలాభం కోసం కబ్జాలు జరుగుతుంటే పట్టించుకోని పోలీసులు ఇకపై అయినా ప్రజలకోసం పని చేయాలంటూ విమర్శలు కురిపించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: