వైసీపీలో కొత్త డిమాండ్‌.. అంద‌రు మంత్రుల‌ను తీసేయాల్సిందే..!

VUYYURU SUBHASH

చాలా కాలం నుంచి ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే...మంత్రివర్గంలో మార్పులు గురించి అనేక రకాల చర్చలు నడిచాయి..ఈ సారి మంత్రులని పూర్తిగా తొలగించి కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకుంటారని టాక్ నడిచింది..అదే సమయంలో కొందరిని మాత్రమే తప్పించే, మరికొందరిని మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తారని ప్రచారం వచ్చింది...కానీ వీటిల్లో ఏదో జరుగుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు.


అదే సమయంలో ఎప్పుడు మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయో కూడా క్లారిటీ రాలేదు...అయితే తాజాగా క్యాబినెట్ సమావేశంలో...జగన్ మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జూన్‌లో ఉంటుందని జగన్ అధికారికంగా చెప్పేశారు.. అలాగే ఇప్పటిదాకా మంత్రులుగా పదవులు చేపట్టినవారిలో కొందరికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.


అంటే జూన్ లో మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని క్లియర్ గా తెలుస్తోంది...కాకపోతే ఇక్కడ అందర్నీ సైడ్ చేసి, కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకుంటారా? లేక కొంతమందిని కంటిన్యూ చేస్తారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం చూసుకుంటే కొందరు మంత్రులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది...సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటిన్యూ అవ్వొచ్చని తెలుస్తోంది...అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని లాంటి వారు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం ఉంది.


అయితే జగన్ మదిలో ఏముందో ఎవరికి తెలియడం లేదు...కాకపోతే మెజారిటీ మంత్రులంతా అనుకునేది ఒకటే...తప్పిస్తే అందరినీ తప్పించేయాలని కోరుకుంటున్నారు. కానీ కొందరిని తొలగించి.. మిగతావారిని కొనసాగిస్తే.. అందుకు కారణాలు వెతుక్కోవాల్సి వస్తుందని, అంటే ఆ మంత్రులేదో తప్పు చేసినవారుగా ఉంటారని, పైగా నియోజకవర్గంలో ముఖం చూపించుకోలేని పరిస్థితి తలెత్తుతుందని కొందరు మంత్రులు ఆవేదన చెందుతున్నారు. మరి చూడాలి జగన్ అందరినీ సైడ్ చేస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: