క్యాబినెట్ ‘ఎలిమినేషన్’..వాళ్ళు ఫిక్స్?

M N Amaleswara rao
మొత్తానికి మంత్రులకు చేదువార్త..ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు..త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చేశారు..జూన్ నెలలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు జగన్ సిద్ధమవుతున్నారు..ఇక అప్పుడు పాత మంత్రులని సైడ్ చేయడం ఖాయమే...కాకపోతే అందరినీ మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? లేదా? అనేది పూర్తి క్లారిటీ లేదు...కానీ 80 శాతం నుంచి 90 శాతం మంత్రులని గ్యారెంటీగా తొలగిస్తారని తెలుస్తోంది...ఓ నలుగురైదుగురు మంత్రులని తిరిగి కొనసాగించిన మిగిలిన వారిని మాత్రం సైడ్ చేసేస్తారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే మళ్ళీ కంటిన్యూ అయ్యే వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని పేర్లు వినిపిస్తున్నాయి..మరి వీరిని కంటిన్యూ చేస్తారో లేదో పక్కన పెడితే మిగిలిన వారిని తప్పనిసరిగా తొలగించే ఛాన్స్ మాత్రం ఉందని అంటున్నారు. ఇక క్యాబినెట్ నుంచి ఔట్ అయ్యేవరి లిస్ట్ ఒకసారి చూస్తే...శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, విజయనగరం నుంచి పుష్పశ్రీ వాణి, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్, తూర్పు గోదావరి నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వరూప్ ఉన్నారు..అయితే కన్నబాబు విషయంలో క్లారిటీ లేదు.
పశ్చిమ గోదావరికి వస్తే ఆళ్ళ నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కృష్ణా జిల్లాకొస్తే వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ఔట్ అవుతారు...పేర్ని విషయంలో కాస్త క్లారిటీ లేదు. గుంటూరులో సుచరిత, ప్రకాశంలో సురేష్, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్, చిత్తూరులో నారాయణస్వామి, కర్నూలులో గుమ్మనూరు జయరాం, అనంతపురంలో శంకర్ నారాయణ, కడపలో అంజాద్ బాషాలు క్యాబినెట్ నుంచి బయటకు రావడం గ్యారెంటీ.
అయితే నెల్లూరు జిల్లాలో మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. మొత్తానికి పేర్ని నాని, కన్నబాబు విషయంలో క్లారిటీ లేదు గాని..మిగిలిన వారు మాత్రం మొహమాటం లేకుండా మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సిందే అని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ ఎవరిని కంటిన్యూ చేసి, ఎవరిని సైడ్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: