‘పేట’ల్లో సైకిల్ సవారీ?

M N Amaleswara rao
ఏపీలో రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది...కేవలం అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగానే రాజకీయం నడవటం లేదు...ప్రతిపక్ష టీడీపీకి సైతం సానుకూలంగా రాజకీయం నడిచే పరిస్తితి కనిపిస్తోంది..ఎక్కడకక్కడ రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి..చాలా నియోజకవర్గాల్లో పోలిటికల్ సీన్ మారిపోతుంది..వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో టీడీపీకి అనుకూలమైన పరిస్తితులు కనిపిస్తున్నాయి..అలా టీడీపీకి అనుకూలంగా పలు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి...ముఖ్యంగా పేటల్లో సీన్ మారుతుంది..అంటే పేట అనే పేరున్న నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకమైన పరిస్తితులు వస్తున్నాయి.
 వాటిల్లో మొదటగా పాయకరావుపేటలో సీన్ పూర్తిగా మారిపోతుంది...ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది...ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ వాళ్లే బాబురావుని వ్యతిరేకించే పరిస్తితి కనిపిస్తోంది.. ఇక్కడ టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత పికప్ అవుతున్నారు..ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అనిత ఉన్నారు. మొత్తానికి పాయకరావుపేటలో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది.
ఇక జగ్గంపేట నియోజకవర్గానికి వస్తే..ఇక్కడ వైసీపీతో ధీటుగా టీడీపీ వస్తుంది..వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టఫ్ ఫైట్ ఇచ్చేలా జ్యోతుల నెహ్రూ పనిచేస్తున్నారు...సీనియర్ నేత అయిన నెహ్రూ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ జగ్గంపేటలో దూసుకెళుతున్నారు. ఇంకాస్త కష్టపడితే జగ్గంపేటలో జ్యోతుల నెక్స్ట్ గెలిచే అవకాశం ఉంది. ఇటు జగ్గయ్యపేట విషయానికొస్తే వైసీపీని దాటుకుని టీడీపీ లీడ్ లోకి వచ్చేలా కనిపిస్తోంది..ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగ్గయ్యపేటలో వైసీపీని టీడీపీ దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇక్కడ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ధీటుగా టీడీపీ నేత శ్రీరామ్ తాతయ్య పనిచేస్తున్నారు.
ఇక చిలకలూరిపేటలో కూడా సీన్ మారుతూ ఉంది..ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు చెక్ పెట్టేలా ఉన్నారు..రెండున్నర ఏళ్లలోనే ప్రత్తిపాటి చాలావరకు పుంజుకున్నారు..పైగా రజినికి సొంత పార్టీ నుంచే కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అటు నరసారావుపేటలో కాస్త వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది..ఇక్కడ టీడీపీ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి పేటలో సైకిల్ సవారీ జరిగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: