ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కీలక అంశాలు ఇవే?

praveen
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా 2022- 23 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ వేదికగా ఆర్థిక బడ్జెట్ ను చదివి వినిపించారు. ఇక అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి కురసాల కన్నబాబు సాయి బడ్జెట్ ను అసెంబ్లీ వేదికగా విడుదల చేశారు.

 ప్రజల కడుపు నింపడానికి నిరంతరం కష్టపడుతున్న రైతులందరికీ సభ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ తెలుపుతూ తన ప్రసంగాన్ని అసెంబ్లీ వేదికగా మొదలుపెట్టారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్రం రెండేళ్లకొకసారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచి ఈ విషయాన్ని వెల్లడించింది  అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో రైతులు వెన్నంటి ఉంటూ సాయం అందించడం వల్ల ఇది సాధ్యం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆయన.

వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి..
*నీటి పారుదల రంగానికి రూ.11,450.94 కోట్లు
వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కోసం రూ.3,900 కోట్లు
*వ్యవసాయం విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.5000 కోట్లు
*ప్రకృతి విపత్తుల సహాయ నిధి రూ.2000 కోట్లు
*వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కోసం రూ.1,802 కోట్లు
*పశు సంవర్థక శాఖకు రూ.1,027.82 కోట్లు
*వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు
*మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు
*వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయానికి రూ.122.50 కోట్లు
*మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు, మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధికి రూ.614.23 కోట్లు
*సహకార శాఖలకు రూ.248.45 కోట్లు
*ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు
*ఉద్యాన శాఖకు రూ.554 కోట్లు
*ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ *వర్సిటీకి రూ.421.15 కోట్లు
*వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ.59.91 కోట్లు
*వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.50 కోట్లు
*వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత కోసం రూ.200 కోట్లు
*రైతుల ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
*రైతు భరోసా కేంద్రాల బలోపేతానికి రూ.18 కోట్లు
*సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు
*విత్తన రాయితీ కోసం రూ.200 కోట్లు
*పట్టు పరిశ్రమకు రూ.98.99 కోట్లు
26 జిల్లాల్లో వైయస్‌ఆర్‌ రైతు భవన్‌ నిర్మాణాలకు రూ.52 కోట్లు.. కేటాయింపులు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: