హైదరాబాద్ : చంద్రబాబు లాగే ఇజ్జత్ పోగొట్టుకున్నారా ?

Vijaya



చాలా తెలివైన వాడు, మాటల మాంత్రికుడు, రాజకీయ చాణుక్యుడు ఇలా ఎన్నెన్నా చెప్పుకోవచ్చు కేసీయార్ గురించి. కానీ అవన్నీ టైం అనుకూలించినపుడు మాత్రమే పనిచేస్తాయి. టైం అనుకూలించకపోతే ఎంతటి చాణుక్యుడైనా బక్కబోర్లా పడాల్సిందే. టైం అనుకూలించకపోయినా నెగ్గుకురాగలిగిన వాడే అసలైన చాణుక్యుడు. ఇప్పుడింతా ఎవరికోసమో అర్ధమైపోయుంటంది. అవును కేసీయార్ గురించే.



ఒకపుడు చంద్రబాబునాయుడు లాగే ఇపుడు కేసీయార్ కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నారు. తనకు సంబంధంలేని విషయాల్లో వేలుపెట్టి కేసీయార్ పరువంతా పోగొట్టుకున్నారు. నరేంద్రమోడిని అది చేసేస్తా ? బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా ? కేంద్రప్రభుత్వం అవినీతిని బయటపెడతా ? అంటు ఏమిటేమిటో మాట్లాడారు. మోడికి వ్యతిరేకంగా వారణాసికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. వారణాసిలో పెద్ద పెద్ద వినైల్ పోస్టర్లు కూడా కనిపించాయి. మరెక్కడ ప్రచారం చేశారో ఏమో తెలీలేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే కేసీయార్ తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు. 



సీన్ కట్ చేస్తే రెండోసారి కూడా ఉత్తరప్రదేశ్ లో బీజేపీనే అధికారంలోకి వచ్చింది. యూపీలోనే కాదు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లో కూడా వచ్చేసింది. మరి కేసీయార్ చాలెంజులన్నీ ఏమైనట్లు ? మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పి ఏమి సాధించినట్లు ? ఒకపుడు అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడా ఇలాగే నోటికొచ్చినట్లు ఏదేదో చాలెంజులు చేశారు. కర్నాటక, బెంగాలు, ఢిల్లీ, తమిళనాడుకు వెళ్ళి మోడి వ్యతిరేక ప్రచారం చేశారు.



కాలికిబలపం కట్టుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేస్తే ఏమైంది ? 2014కన్నా మరింత ఎక్కువ మెజారిటితో మోడి నేతృత్వంలోని  ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దేశంలో ఎక్కడెక్కడో తిరిగిన చంద్రబాబు సొంతరాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయారు. ఆ దెబ్బకు మళ్ళీ ఇప్పటివరకు మోడికి వ్యతిరేకంగా నోరెత్తితే  ఒట్టు. అప్పట్లో చంద్రబాబు అయినా ఇపుడు కేసీయార్ అయినా గ్రౌండ్ లెవల్లో జనాలనాడి ఏమిటో తెలుసుకోకుండానే నోటికొచ్చినట్లు చాలెంజులు చేసి ఇజ్జతు పొగొట్టుకున్నారు. మరి తాజా దెబ్బకు కేసీయార్ ఏమి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: