అమరావతి : పార్టీల్లో మార్చి 14 టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya



షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో జతకడుతుంది ? పార్టీల మధ్య పొత్తులు, లాభనష్టాలపై చర్చలు జోరుగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఇపుడందరి దృష్టి జనసేనపైనే కేంద్రీకృమైంది. దీనికి కారణం ఏమిటంటే ఈనెల 14వ తేదీన మంగళగిరిలో పార్టీ ఆవిర్భావసభ జరగుతుండటమే.




ఆ సభలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగ భవిష్యత్తు కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పటంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిందేమంటే ఇప్పటికైతే బీజేపీ+జనసేన పొత్తుల్లో ఉన్నాయి. అయితే ఈ పొత్తుల వల్ల రెండుపార్టీలకూ వచ్చేది లేదు పోయేదీలేదు. రెండుపార్టీలు కలిసి పోటీచేస్తే ఎన్ని ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది కలే. ఇందుకే  బీజేపీతో పొత్తుకన్న జనసేన ఒంటరిగా పోటీచేయాలనే డిమాండ్లు పార్టీలో పెరిగిపోతున్నాయి.



నిజానికి జనేసేన ఒంటిరిగా పోటీచేస్తేనే దాని సత్తా ఏమిటో తేలుతుంది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపాలనే పవన్ కల నెరవేరదు. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టకునే అవకాశాలపై ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ-జనసేన పొత్తంటే చూడటానికి బలంగానే కనబడుతుంది. కానీ క్షేత్రస్ధాయిలో, ఓట్ల బదలాయింపులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబును సీఎం చేయటానికి తామెందుకు కష్టపడాలని జనసేన+కాపు నేతలు అడుగుతున్నారు. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించేట్లయితే టీడీపీతో పొత్తుకు అభ్యంతరం లేదని కాపు నేతలంటున్నారు. ఇది జరిగేపనికాదని వాళ్ళకూ తెలుసు.



ఈ నేపధ్యంలో ఈనెల 14వ తేదీన పవన్ చేయబోయే ప్రకటనపై వైసీపీ, టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే చంద్రబాబు పంపిన లవ్ ప్రజోజల్ గురించి అందరికీ తెలిసిందే. లవ్ ప్రపోజల్ ను పవన్ అంగీకరిస్తే టీడీపీలో జోష్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. తిరస్కరిస్తే వైసీపీ హ్యాపీ, బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకుంటారు. పవన్ నిర్ణయంలో  ఇన్ని ట్విస్టులున్నాయి కాబట్టే పార్టీల్లో  మార్చి 14 టెన్షన్ పెరిగిపోతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: