హైదరాబాద్ : కేసీయార్ విషయంలో జుట్లు పీక్కుంటున్నారటగా ?

Vijaya



ఇపుడిదే వెరీ ఇంట్రస్టింగ్గా మారింది. నరేంద్రమోడిని అదిచేస్తాను, ఇదిచేస్తానంటు ఐదురోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఐదురోజుల్లో ఢిల్లీలో కూర్చుని కేసీయార్ ఏమి చేశారంటే ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఢిల్లీలోని తనింట్లో కూర్చున్న కేసీయార్ బయటకు కూడా వెళ్ళటంలేదట. మరి ఇంట్లోనే కూర్చునేదానికి ఢిల్లీకి వెళ్ళటం ఎందుకు ? ఎర్రవల్లిలోని తన ఫాం హౌసే ఉందికదా ? మామూలుగానే ఫాం హౌస్ లో కూర్చుంటే వారాల తరబడి బయటప్రపంచంతో సంబంధాలుండవు కేసీయార్ కు.



మరిపుడు ఢిల్లీలో కూడా అదే చేస్తుండటమే అందరికీ అయోమయంగా ఉంది. ఐదు రోజులకు గాను బీజేపీ రాజ్యసభ ఎంపి సుబ్రమణ్యంస్వామి మాత్రమే కేసీయార్ ను కలిసెళ్ళారు. ఈ స్వామి వల్ల అయ్యేది లేదు పోయేది లేదు. నరేంద్రమోడితో స్వామికి చెడిన కారణంగానే కేసీయార్ ను బహిరంగంగా కలిసినట్లున్నారు. ఇదే స్వామి ఆమధ్య బెంగాల్ సీఎం మమతాబెనర్జీని కూడా కలిశారు. ఎందుకు కలిశారంటే ఎవరి దగ్గరా సమాధానం లేదు. పనిలో పనిగా రైతునేత రాకేష్ తికాయత్ కూడా భేటీ అయ్యారు. 



ఢిల్లీ టూరులో ఆప్ కన్వీనర్,  సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కేసీయార్ భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే కేసీయార్ ఢిల్లీ చేరుకునేపట్పటికే కేజ్రీవాల్ ఢిల్లీలో లేరట. మరో నాలుగు రోజులకు కానీ రారట. కేజ్రీవాల్ కాకుండా కేసీయార్ ఇంకెవరిని కలుస్తారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. తెలంగాణా భవన్ కు కాదు కదా చివరకు మీడియా వాళ్ళు కూడా కేసీయార్ డైలీ రొటీన్ ఏమిటో తెలుసుకోలేక జుట్టు పీక్కంటున్నారు.



అసలు కేసీయార్ ఢిల్లీకి ఎందుకొచ్చారు ? ఏమి చేస్తున్నారు ? అనేది ఎవరికీ తెలీటంలేదు. నాలుగు రోజులుగా ఇంట్లోనుండి బయటకు రాకుండా అందరితోను ఫోన్లోనే మంతనాలాడుతున్నారా ? ఇదే నిజమైతే ఈమాత్రం దానికి ఢిల్లీకి రానక్కర్లేనే లేదు. యూపీ ఎన్నికల్లో మమత బిజీగా ఉన్నారు. ఎన్నికలు అయితే కానీ ఎస్పీ అధినేత అఖిలేష్ ఎవరితోను మాట్లాడరు. ఇదే ఎన్నికలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా బిజీ. శివశేనతో కేసీయార్ కు లింకు కుదిరేట్లు లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో కూడా ఇదే పరిస్ధితి. మరి కేసీయార్ ఏమి చేస్తున్నారబ్బా ఇంట్లోనే కూర్చుని ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: