వారసులకు ఫస్ట్ విక్టరీ?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో ఎంతమంది వారసులు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు..సొంతంగా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన నాయకులు తక్కువే గాని..తమ తండ్రుల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారసులు ఎక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సీఎంగా ఉన్న జగన్..వైఎస్సార్ వారసుడుగా వచ్చారు...ఇటు టీడీపీలో కీలకంగా ఉన్న నారా లోకేష్, చంద్రబాబు వారసుడుగా వచ్చారు. అంటే రాజకీయాలు మొత్తం వారసులు చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పొచ్చు.
ఇక ఈ రాజకీయాల్లో కొంతమంది వారసులు సక్సెస్ అయ్యారు..మరి కొంతమంది సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారు. అలా సక్సెస్ కోసం చూస్తున్న వారిలో టీడీపీ వారసులు ఎక్కువమందే ఉన్నారు...గత ఎన్నికల్లో చాలామంది వారసులు ఎన్నికల బరిలో దిగారు..కానీ ఎవరు సక్సెస్ కాలేకపోయారు...అయితే ఈ సారి ఎన్నికల్లో సక్సెస్ అవ్వాలని చెప్పి టీడీపీ వారసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు..ఫస్ట్ విక్టరీ కొట్టాలని చూస్తున్నారు.
అలా ఫస్ట్ విక్టరీ కొట్టాలని చూస్తున్న వారిలో గౌతు శిరీష కూడా ఒకరు...గౌతు లచ్చన్న మనవరాలు అయిన శిరీష్..తన తండ్రి గౌతు శ్యామ్ సుందర్ వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చారు...2019 ఎన్నికల్లో పలాసలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు..కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు...అలాగే ఈ సారి పలాసలో శిరీషకు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ విక్టరీ కోసం చూస్తున్న వారిలో కాగిత కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు...సీనియర్ నేత కాగిత వెంకట్రావు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కాగిత కృష్ణప్రసాద్...2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు..ఈ సారి మాత్రం పెడనలో తొలి విజయాన్ని దక్కించుకోవాలని కసితో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పెడనలో కృష్ణప్రసాద్‌కు పాజిటివ్ ఎక్కువగానే ఉంది..నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక పరిటాల వారసుడు శ్రీరామ్..గత ఎన్నికల్లో రాప్తాడులో పోటీ చేసి ఓడిపోయారు...ఈసారి ధర్మవరం బరిలో నిలిచి గెలవాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ వారసులంతా ఫస్ట్ విక్టరీ కొట్టడానికి రెడీగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: