వెస్ట్‌లో వైసీపీ విన్నింగ్ సీట్లు అవేనా?

M N Amaleswara rao
అసలు జగన్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కూడా కాలేదు..అప్పుడే గెలుపోటములు ఏంటి అనుకోవచ్చు..అయితే ఏపీలో ఎప్పుడు గెలుపోటముల గురించి చర్చ నడుస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు...ఎన్నికలు అయిన వారం రోజుల్లోనే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం మన ఏపీ రాజకీయాల్లో కామన్‌గా జరిగే పని...అలాంటిది ఎన్నికలై మూడేళ్లు కావొస్తుంది...మరి అలాంటప్పుడు నెక్స్ట్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడంలో పెద్ద తప్పు లేదని చెప్పొచ్చు...ఇప్పటికే మళ్ళీ జగన్ గెలుస్తారంటారా? ఈ సారి చంద్రబాబుకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా? లేక పవన్ వైపు ఏమన్నా చూస్తారా? అని చెప్పి రాష్ట్రంలో చర్చలు నడుస్తున్నాయి.
అలాగే నియోజకవర్గాల్లో కూడా ఈ గెలుపోటములపై చర్చలు నడుస్తున్నాయి...అబ్బే ఆ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయడం లేదండి...మళ్ళీ ఆయన గెలవరండి అని లేదా ఆ టీడీపీ నేత బాగా పికప్ అయిపోయారండి...ఈ సారి అక్కడ టీడీపీ గెలిచేస్తుందని చెప్పి కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గెలుపోటములపై రకరకాల చర్చలు సాగుతున్నాయి..గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 15 సీట్లలో వైసీపీ 13, టీడీపీ 2 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే..మరి ఈ సారి ఆ జిల్లాలో పరిస్తితి ఏంటి అనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
ఈ సారి మాత్రం వైసీపీకి అన్ని సీట్లు దక్కడం కష్టమని, ఈ సారి వెస్ట్‌లో టీడీపీ కూడా కొన్ని సీట్లు గెలుచుకోవడం ఖాయమని, అదే సమయంలో రెండు, మూడు సీట్లలో జనసేన కూడా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది..అదే సమయంలో టీడీపీ-జనసేనలు కలిస్తే మాత్రం వెస్ట్‌లో ఆ పార్టీల హవానే ఉంటుందని అంటున్నారు.
ఇక రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసినా సరే వైసీపీకి కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుమారు 3-5 సీట్లు వైసీపీ గెలుచుకోవచ్చని అంటున్నారు..చూడాలి మరి ఈ సారి టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఉంటే వైసీపీ ఏ మేర సత్తా చాటుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: