ఛీ ఛీ : అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న రష్యా సైనికులు..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులకు భయానక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇండియా చేరుకునేందుకు ఉక్రెయిన్ సరిహద్దులకు వస్తున్న తమ స్నేహితులపై రష్యా సైనికులు కాల్పులు జరిపారనీ.. కొందరు అమ్మాయిలను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని యూపీకి చెందిన ఓ యువతి వివరించింది. భారత సైన్యాన్ని పంపించి తమను రక్షించాలని ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కోరింది.
ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులకు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. విద్యార్థులతో పాటు భారతీయ పౌరులందరూ ఈ రోజు వెంటనే కీమ్ నగరం నుంచి బయల్దేరాలని సూచించింది. ట్రైన్స్ లేదా ఇతర మార్గాల్లో సరిహద్దులకు చేరాలని తెలిపింది. ఉక్రెయిన్ లో యుద్ధ తీవ్రత పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. సీ-17 యుద్ధ విమానాల ద్వారా భారతీయులను ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య రెండో విడత చర్చలు మార్చి 2న జరగనున్నాయి. దాడుల నివారణ, ఇతర అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు రేపు చర్చించనున్నారు. అయితే సోమవారం జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియగా.. రేపు జరిగే చర్చలు యుద్ధం ముగింపు దిశగా సాగాలని అంతా ఆకాంక్షించారు.
ఇక పుతిన్ నాయకత్వంలోని రష్యా.. ఉక్రెయిన్ లోని పలు ముఖ్య నగరాలపై విరుచుకుపడుతోంది. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్ లో ఓ భవంతిపై రాకెట్ అటాక్స్ జరిపింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నగరంలో 11మంది పౌరులు మరణించారని.. చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వందలాది యుద్ధ ట్యాంకులు రాజధాని కీవ్ వైపు వెళ్తున్నాయి. అక్కడి మెటర్నిటీ ఆస్పత్రిపైనా షెల్లింగ్ అటాక్స్ జరిగాయి.
మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి ఉత్తరం వైపు భారీగా రష్యా సైనికులు మోహరించారు. సుమారు 65కిలోమీటర్ల మేర సైనిక కాన్వాయ్ ఉంది. వారు కీవ్ వైపు వస్తున్నారని బ్రిటీష్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. మరోవైపు భారతీయులు అక్కడ ఒక్క క్షణం ఉండొద్దని.. వెంటనే సరిహద్దుల వైపు వెళ్లాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా తమపై ఒత్తిడి పెంచేందుకు ట్రై చేస్తోందని జెలెన్ స్కీ చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: