హైదరాబాద్లో అలాంటి ఆటోలు కనిపిస్తే.. ఇక సీజ్ చేయడమే?

praveen
హైదరాబాద్ నగరం.. ఇక్కడ లోకల్ వాళ్ళ కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవనోపాధి పొందుతున్న వారే ఎక్కువమంది ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ నలు మూలల నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఉపాధి పొందుతూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకు బండిని నడిపిస్తూ ఉంటారు. ముఖ్యం గా హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వారి సంఖ్య ఎక్కువ గానే ఉంటుంది అని చెప్పాలి. అందుకే హైదరాబాద్ నగరం లో ఎక్కడ చూసినా ఆటోలు ఒకే చోట ఎక్కువ మొత్తం లో కనిపిస్తూ ఉంటాయి.

 ఇటీవలి కాలం లో భాగ్యనగరం లో ఆటో నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. దీంతో పెరిగి పోతున్న ఆటోలు  ట్రాఫిక్కు అంతరాయం గా మారి పోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయం లోనే ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఎంతో మందికి ఊహించని షాక్ ఇచ్చారు అని చెప్పాలి.  హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలకు మాత్రమే నగరం లో తిరిగేందుకు అనుమతిస్తూ ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

 ఇతర రాష్ట్రాలు జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినా ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగడానికి  వీలు లేదు అంటూ స్పష్టం చేశారు. పోలీసులు అలాగే అంటారు లే.. అని నిర్లక్ష్యం గా ఇతర జిల్లాలు రాష్ట్రాల లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలను నగరం లో తిప్పితే   మాత్రం ఆటోను సీజ్ చేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ రవాణా శాఖ లెక్కల ప్రకారం1.50 లక్షల ఆటోలు హైదరాబాద్ నగరం పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే హైదరాబాద్ నగరం లో తిరిగే ఆటోలు మాత్రం ఏకంగా మూడు లక్షలకు పైగానే ఉన్నాయి అని ఇటీవల ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: