బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.  సెషన్‌లు ప్రారంభమయ్యే ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరిగనుంది. ఈ బీఏసీ సమావేశంలో వ్యాపారం మరియు సెషన్ యొక్క రోజుల సంఖ్య నిర్ణయించబడనుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు తదితరులు హాజరు కానున్నారు. అటు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా హాజరు కానున్నారు. మార్చి 7 వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ వ్యూహలు రచిస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల 20 వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.  

ఇది ఇలా ఉండగా...  ఇటీవలే... ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు ఎం అబ్దుల్ అజీజ్ (కొవ్వూరు), ఎ రామిరెడ్డి (దుగ్గిరాల), పి కృష్ణమూర్తి (ముమ్మిడివరం), పి రంగనాయకులు (హిందూపూర్), వంకా శ్రీనివాసరావు (పోలవరం), టి వెంకయ్య (తాడికొండ), మంత్రి గౌతం రెడ్డి మృతికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో... సంతాపం తెలపనున్నారు.   అటు డి పేరయ్య ( ఉం డి), పి న్నె ల్లి ల క్ష్మా రెడ్డి (మా చర్ల), ఎంవి రమణా రెడ్డి (ప్రొద్దుటూరు) మరియు డా. ఎస్ పిచ్చిరెడ్డి (దర్శి), అసెంబ్లీ సమావేశాల మధ్య కాలంలో కన్ను మూ సిన సంగతి మనం అందరికీ తెలిసిందే. మృతి చెందిన ఎమ్మెల్యేల పేర్లు, వారి సహకారాన్ని చదివి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మరియు మృతుల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిజేస్తారు  స్పీకర్ తమ్మినేని సీతారాం. మరణించిన సభ్యులకు నివాళులర్పిస్తూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: