సమ్మక్క సారక్క హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లో తెలుసా?

praveen
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది ఎంతో వైభవోపేతంగా జరిగింది. గతేడాది కరోనా వైరస్ కారణంగా కఠిన ఆంక్షల  మధ్య  జరిగినప్పటికీ ఇక ఈ ఏడాది మాత్రం వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆంక్షలు లేకుండానే జరిగింది. ఈ జాతర ఇక సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇక ఇతర రాష్ట్రాలలో ఉన్న గిరిజనులు సైతం తరలివచ్చారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన ఈ జాతర 19 వరకు కన్నుల పండువగా జరిగింది అన్న విషయం తెలిసిందే.

 జాతర నేపథ్యంలో ఇసుక వేసిన రాలనంత మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక తండోపతండాలుగా మేడారం చేరుకుని ఇక సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇకపోతే ఇటీవలే హుండీ లెక్కింపు ప్రారంభించారు. బుధవారం ఈ హుండీ లెక్కింపు ప్రారంభం కాగా ఇటీవలే ముగిసినట్లు తెలుస్తోంది. హనుమకొండలోని కళ్యాణమండపంలో సమ్మక్క సారలమ్మ జాతర  హుండీలను తెరిచి లెక్కించారు అధికారులు. పటిష్టమైన నిఘా మధ్య ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అయితే గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి సమ్మక్క సారలమ్మ హుండీ ఆదాయం భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది.

మొతంగా 497 హుండీలలో ఇప్పుడు వరకు 65 హుండీలను తెరిచి లెక్కించారు అధికారులు. ఇక ఇప్పటి వరకు ఒక కోటి 34 లక్షల 60 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఆదాయం మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేయడం గమనార్హం. ఇకపోతే మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక మేడారం జాతరకు ఈ ఏడాది అత్యధికంగా కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారు అన్న విషయాన్ని ఇటీవలే అధికారులు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: