హైదరాబాద్ లో రెండు రోజులు డ్రింకింగ్ వాటర్ బంద్.. కారణం ఇదే?

VAMSI
ప్రభుత్వం పాలన అంటే అన్ని విషయాలు సరిగా చూసుకోవాలి. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ముందుగానే అవసరాలను ఊహించి ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోవాలి. అప్పుడే ప్రజలకు పాలనపైన, అధికారుల పైన ఒక నమ్మకం ఏర్పడి వారికి సహకరిస్తారు. ప్రతి ఇంటికి నిత్యావసరాలు అయిన నీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మామూలుగా గ్రామాల్లో లేదా చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఓకె కానీ పెద్ద పెద్ద సిటీల్లో నీటి సరఫరా చేయడానికి ఒక ప్రత్యేక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.


అయితే తాగు నీటి సరఫరా చేసే పైప్ లైన్ లను అప్పుడప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే అవి ఏమైనా తుప్పు పట్టినా లేదా వివిధ కారణాల చేత పగిలినా వాటిని సరి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కొన్ని మరమ్మత్తులు చేయడానికి జల మండలి విభాగం రేపు హైదరాబాద్ లో కొన్ని చోట్ల తాగి నీరు సరఫరా ఉండదని అధికారికంగా తెలియచేసింది. అయితే ఈ మరమ్మతుల కోసం రెండు రోజుల సమయం పట్టేలా ఉంది. రేపు ఉదయం 5 గంటల నుండి పని చేపట్టి ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు పూర్తి చేయనున్నారు. దీనిని బట్టి దాదాపుగా 36 గంటలు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది.  హైదరాబాద్ లో అన్ని చోట్ల కాకుండా కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ మరమ్మత్తులు చేస్తున్నారు.

ఆ ప్రాంతాలలో శాస్త్రిపురం, 
బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట, అల్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాశన్ నగర్, తట్టి ఖన, లలా పేట్, సాహెబ్ నగర్, ఆటో నగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్ పరిసరాలు, సైనిక్ పురి,  మౌలాలి, స్నేహ పురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సోసైటీ, కావూరి హిల్స్, మధుబన్, దుర్గా నగర్, బుద్వెల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హిట్స్, నైన్ నంబర్, బొడుప్పల్, మల్లికార్జున్ నగర్, మాణిక్ చాంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, ఫిర్జాధి గూడ, ధర్మ సాయి లాంటివి ఉన్నాయి. ఈ రోజు నుండే ఇప్పటికే ఉన్న నీటిని వృధా చేయకుండా రేపటికి ఉంచుకోవాలని అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: