ఆ కమ్మ నేతకు ఈ సారి కాపు కాస్తారా?

M N Amaleswara rao
పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు వర్గం ప్రభావం ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇక్కడ రాజకీయాలని కాపు సామాజికవర్గమే ప్రభావితం చేస్తుంది...జిల్లాలో 15 నియోజకవర్గాలు అంటే దాదాపు 10 పైనే స్థానాల్లో కాపుల ప్రభావం ఉంది..ఆ స్థానాల్లో కాపు ఓటర్లే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేయడంలో, 2019 ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లకు 13 సీట్లు గెలవడం వెనుక కీలక పాత్ర పోషించింది కాపులే.
ఇలా కాపులు కీలకపాత్ర పోషించే నియోజకవర్గాల్లో ఉంగుటూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కమ్మ, కాపు నేతల మధ్య వార్ నడిచింది...టీడీపీ నుంచి కమ్మ నేత గన్ని వీరాంజనేయులు ఉండగా, వైసీపీ నుంచి కాపు నేత పుప్పాల వాసుబాబు ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉంగుటూరులోని కాపులు...కమ్మ నేత అయిన గన్నికి మద్ధతుగా నిలవడంతో విజయం సాధించారు..పైగా పవన్ సపోర్ట్ చేయడం కలిసొచ్చింది.
కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది..ఉంగుటూరులో మెజారిటీ కాపు వర్గం వైసీపీ వైపుకు వచ్చింది...పైగా జనసేన సెపరేట్‌గా పోటీ చేసింది...దీంతో పుప్పాల విజయాన్ని గన్ని ఆపలేకపోయారు. దాదాపు 33 వేల ఓట్ల మెజారిటీతో వాసుబాబు గెలిచారు..అంటే కాపు ఓటర్లు ఏ స్థాయిలో మద్ధతు ఇస్తే ఈ మెజారిటీ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో కాపు వర్గం ఏ పార్టీకి మద్ధతుగా ఉంటుందంటే? ప్రస్తుతం ఉంగుటూరులో రాజకీయం పోటాపోటిగా ఉంది..ఇప్పుడు వైసీపీ హవా ఏమి పూర్తిగా లేదు..పైగా టీడీపీ నేత గన్ని పుంజుకున్నారు.
పైగా వైసీపీ పాలనలో కాపులకు ఒరిగింది ఏమి లేదు...అటు వాసుబాబు కూడా చేసింది ఏమి లేదు...దీంతో ఉంగుటూరు కాపుల్లో మార్పు వస్తుంది. ఇదే సమయంలో జనసేన గాని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఉంగుటూరులో వైసీపీకి చెక్ పడుతుంది. మొత్తానికైతే ఈ సారి ఉంగుటూరులో కాపులు కమ్మ నేతకు కాపు కాసేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: