అస్సాం సీఎంను వణికించిన కాంగ్రెస్ మహిళా నేతలు...

VAMSI
మూడు రోజుల క్రిందట రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతున్నాయి చూస్తూనే ఉన్నాము. ఒక సీఎం స్థానంలో ఉంది ఒక సీనియర్ నేతను నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆయనపై గద్గద స్వరంతో విమర్శలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్రంలో గరం గరం అవుతోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. అందుకే కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు.
అయితే తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గీతా రెడ్డి మరియు తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకా చౌదరి లు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి గీతా రెడ్డ్డి మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఇలాంటి వారికీ సీఎం గా ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు. తాను రాహుల్ గాంధీ పై చేసిన అసభ్య వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి వెంటనే సీఎం గా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి కామెంట్స్ పేరిట సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు అంటూ ఇద్దరు మహిళా నాయకులు ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. సీఎం హిమంతకు మహిళలు అంటే ఏ మాత్రం గౌరవం లేదని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన సునీతా ఈ విషయం తన పరిధిలోకి రాదని కేంద్ర కమిషన్ కు పంపుతానని చెప్పారని తెలుస్తోంది. అంతే కాకుండా రేణుకా చౌదరి చివరగా ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదే చివరి సారి కావాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి ముందు ముందు ఇంకెంత దుమారాన్ని రేపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: