2రూ.లకే దోశ.. 3 రూ. లకే ఇడ్లీ.. ఎక్కడంటే?

praveen
ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో టిఫిన్ చేస్తూ రోజుని ప్రారంభిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇడ్లీ దోశ లాంటివి తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా టిఫిన్ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం 20 రూపాయల నుంచి 200 వరకు టిఫిన్ ధరలు ఉన్నాయి. ఇక ఇంతకంటే తక్కువ ఎక్కడైనా టిఫిన్ లభిస్తుంది అంటే చాలు ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇలాంటి ఆశ్చర్య పరిచే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అన్నిరకాల ధరలు పెరిగి పోయిన సమయంలో కూడా తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన చిన్న తంబీ మాత్రం రెండు రూపాయలకే దోష మూడు రూపాయికే ఇడ్లీ అమ్ముతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

 ఇక ఇలా తక్కువ ధరకే దోశ ఇడ్లీ అమ్ముతున్న చిన్న తంబీ వ్యాపారం తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయింది. దీంతో ఎంతో రుచికరమైన టిఫిన్ తినడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. ప్రతిరోజు 600 నుంచి 800 వరకు దోషులను అమ్ముతున్నాడట చిన్న తంబి. రాత్రివేళ ఇడ్లీ పరోటా తో పాటు హమ్లెట్ ను కూడా అందిస్తారట. కాగా తమిళనాడులోని ఒరైయుర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న వీధి లో చిన్న తంబి కి చిన్న హోటల్ ఉంది. ఆరు సంవత్సరాల నుంచి రెండు రూపాయలకే దోష మూడు రూపాయలకు ఇడ్లీ అమ్ముతాడు ఇక ప్రతి రోజూ వందలాది మంది కస్టమర్లు అక్కడికి వస్తారట.

 అయితే కొన్నాళ్లపాటు హోటల్లో పని చేసిన చిన్న తంబీ తానే స్వయంగా హోటల్ ప్రారంభించాలి అని అనుకున్నాడు. అయితే పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే దోష రెండు రూపాయలు ఇడ్లీ మూడు రూపాయలు క్యారెట్ ఉల్లిపాయలతో  చేసే ఊతప్పం 4 రూపాయలకే అమ్ముతూ ఉంటాడు.  మృతులు పది రూపాయల నోటు తో వచ్చి కడుపు నింపుకోవాలి అనే ఉద్దేశంతోనే హోటల్ ప్రారంభించి తక్కువ ధరలు పెట్టాను అంటూ చెబుతున్నాడు చిన్న తంబి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: