జగన్‌కు మళ్ళీ కాపు కాసేది ఎవరు?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో కాపు వర్గం చాలా కీలకమని చెప్పొచ్చు...రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న వర్గాల్లో కాపు కులం ముందుంది...వారికే గెలుపోటములని డిసైడ్ చేసే శక్తి ఉంది..అయితే గత ఎన్నికల్లో కాపు వర్గం జగన్‌కు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది..దీంతో వైసీపీ సత్తా చాటింది...అలాగే వైసీపీలో కాపు నేతలు కూడా మెజారిటీ సంఖ్యలో విజయం సాధించారు. అందుకే జగన్ సైతం తన క్యాబినెట్‌లో కాపు కులానికి పెద్ద పీఠ వేశారు..కాపు వర్గానికి చెందిన ఐదుగురు నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు.
బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఆళ్ల నాని, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లని క్యాబినెట్‌లో తీసుకున్నారు...ఈ రెండున్నర ఏళ్ళు ఈ కాపు మంత్రులు జగన్‌కు బాగానే కాపు కాస్తూ వచ్చారనే చెప్పొచ్చు..ప్రత్యర్ధుల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చిన తిప్పికొట్టడంలో ముందు ఉండేవారు. ముఖ్యంగా బొత్స, పేర్ని, కన్నబాబు లాంటి వారు జగన్‌కు బాగా అండగా నిలిచారు. అయితే ఇలా జగన్‌కు కాపు కాస్తూ వచ్చిన ఈ మంత్రులని ఈ సారి పక్కన పెట్టేస్తారా? అంటే..త్వరలో మంత్రివర్గంలో మార్పులు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కొందరు కాపు మంత్రులని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది...ఒకవేళ క్యాబినెట్‌లో 100 శాతం మార్పులు చేస్తే అందరు మంత్రులు సైడ్ అయిపోతారు...అలా కాకుండా కొందరు సీనియర్లని అట్టిపెట్టుకుని మిగిలిన వారిని పక్కనబెడితే కొందరు కాపు మంత్రులు సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణని కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..అదే సమయంలో పేర్ని నాని, కన్నబాబు లాంటి వారికి కూడా కాస్త ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆళ్ల నాని, అవంతిలకు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక కాపు కోటాలో పదవులు దక్కించుకోవడం కోసం చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో ఎవరిని తప్పించి, కొత్తగా ఏ కాపు నేతని క్యాబినెట్‌లో తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: