ఏపీ : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం ఏమన్నారంటే ?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కరోనా వైరస్ ఆంక్షలు కొనసాగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒకవేళ పెట్టుకోకపోతే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.షాపింగ్ మాల్స్ ఇంకా అలాగే బహిరంగ ప్రదేశ్లాల్లో ఖచ్చితంగా కరోనా వైరస్ కి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షల చేయాలని కూడా ఆదేశించింది.అందుకోసం ఇక వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది.అలాగే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను ఇంకా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది.

ఇక రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ గణనీయంగా తగ్గిందని, పాజిటివ్‌ కేసులు కూడా గణనీయంగా తగ్గాయని అధికారులు ముఖ్య మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో 0.82 శాతానికి పడిపోయిన కోవిడ్‌ 19 యాక్టివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. గత వారం సమావేశం నాటికి 1,00,622 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇక ఇప్పుడు 18,929కి పడిపోయాయని అన్నారు. ఇందులో ఆస్పత్రిలో చేరిన కేసులు మొత్తం కూడా 794 కాగా, ఐసీయూలో ఉన్నవారు వచ్చేసి కేవలం 130 మంది, వీరిలో కూడా దాదాపుగా చాలా మంది కూడా కోలుకుంటున్నారని తెలియజేశారు. 794లో 746 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సని కూడా అందిస్తున్నామన్నారు.ఇక ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... రాత్రిపూట కర్ఫ్యూ ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మాస్క్‌లు అనేవి ఖచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలన్నారు. దుకాణాలు ఇంకా అలాగే వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న ముఖ్య మంత్రి లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ కూడా ముమ్మరంగా కొనసాగాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: