ఎలోన్‌ మస్క్‌ సంచలన ప్రకటన ?

Veldandi Saikiran
ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ టెల్సా సీఈవో ఎలోన్‌ మస్క్‌ తన మనసులోని బాధను బయటపెట్టాడు. తొలి సంతానం చనిపోయినపుడు తాను పడిన వేదన వర్ణనాతీతవ అని పేర్కోన్నారు. టెస్లా కారు ప్రమాదంలో మరణించి యువకు డి తం డ్రితో  జరిపి న ఈ మె యిల్‌ సం భాషణల సందర్భంగా ఆయన తన బాధను షేర్‌ చేసుకున్నారు. 2018లో ఈ సంభాషణ జరిగింది. 2018,మే 10న మృతుని తండ్రి జేమ్స్ రిలేకి పంపిన ఇ-మెయిల్‌లో.. పిల్లలను పోగొట్టుకోవటం కన్నా మించిన బాధ మరేదీ ఉండదని మస్క్‌ తన సానుభూతి వ్యక్తం చేశాడు. రిలే 18 ఏళ్ల కుమారుడు బారెట్ రిలే, అతని స్నేహితుడు ఎడ్గార్ మోన్సెరాట్ టెస్లా కారు ప్రమాదంలో చనిపోయారు. గంటకు 116 మైళ్ల వేగంతో వెళుతున్న టెస్లా మోడల్ -S పై నియంత్రణ కోల్పోవటంతో ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలోని కాంక్రీట్ గోడను కారు గుద్దుకోవటంతో మంటు రేగాయి. 

ఇ-మెయిల్‌ లేఖలను మొదట బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేసింది. ప్రమాదం జరిగినపుడు ముందు సీట్లో కూర్చున్న ఎడ్గార్‌ కుటుంబ సభ్యులు ఈ ప్రమాద ఘటనపై కోర్టుకు వెళ్లారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ భయంకర ప్రమాదానికి సంబంధించి కస్టమర్ రిలిషేన్స్‌లో మస్క్ వ్యక్తిగతంగా కూడా ఇన్వాల్వ్‌ అయ్యాడు. ఏడు వారాల పాటు సాగిన ఈ సందేశాలను చూస్తే ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. తనకు వ్యక్తిగత జీవితంలో జరిగిన నష్టాన్ని కూడా వారితో పంచుకుంటారు. నిజానికి మస్క్‌ ఇలాంటి వాటిపై బహిరంగంగా మాట్లాడటం చాలా చాలా అరుదు. తన తొలి సంతానం మగ బిడ్డ తన చేతుల్లోనే కన్నుమూశాడని చెప్పాడు. తన చిన్నారి చివరి హృదయ స్పందనను అనుభవించానని ఎలోన్ మస్క్ తన కుమారుడు నెవాడా అలెగ్జాండర్ మస్క్ గురించి రాశాడు. నెవాడా 10 వారాల వయస్సులో మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: