వైరస్ తో 7 నెమళ్ళు మృతి... స్థానికులలో మొదలైన భయం?

VAMSI
గత రెండున్నరేళ్ల నుండి ప్రపంచం అంతా కూడా కంటికి కనిపించని ఒక మహమ్మారికి భయపడుతూ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రాణం విలువ తెలియని మనిషి ఉంటాడు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ వైరస్ ఇంకా మనకు నియంత్రణలో లేదు. ఇప్పటికీ కేసులు వస్తూనే ఉన్నాయి. ఇది మానవుల పరిస్థితి... ఇప్పుడు అదే విధంగా మూగ జీవాలు అయిన కొన్ని జీవరాశులు కూడా వివిధ రకాల వైరస్ లు సోకడం కారణంగా తమ ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు చాలానే చూశాము. తాజాగా జరిగిన ఒక సంఘటనలో కూడా నెమళ్ళు మృతి చెందాయి.
అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో సోమల మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మిట్టపాలెం దగ్గర ఉన్న వ్యవసాయ పొలాల్లో 7 నెమళ్ళు మృతి చెంది ఉండడాన్ని  ఆ ప్రాంత ప్రజల చూసి అవాక్కయ్యారు. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ బృందం పశువైద్య డాక్టర్స్ ను తీసుకుని వచ్చి  వెంటనే చనిపోయి ఉన్న నెమళ్లను తీసుకుని వెళ్ళారు. వీటికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అధికారి ఒకరు ఈ నెమళ్ళు బ్యాక్టీరియా సోకడం మూలంగానే చనిపోయినట్లు ధృవీకరించారు.
అంతే కాకుండా ఈ వైరస్ గాలి ద్వారానే నెమళ్లకు వచ్చినట్లు సదరు అధికారి తెలిపారు. దీనితో స్థానికులలో భయం మొదలైంది, గాలి ద్వారా అనడంతో ముందు ముందు వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని కంగారు పడుతున్నారు. అయితే వీరు చెబుతున్న ప్రకారం ప్రస్తుతానికి అయితే దీని గురించి ఎక్కువ విషయాలు చెప్పలేమని, ఈ విషయంపై పరిశోధన చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని భయపదలసిన అవసరం ఈమె లేదని వారికీ దైర్యం చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: