మహిళ: నా బిడ్డకు ఆ బీజేపీ ఎమ్మెల్యేనే తండ్రి... ?

VAMSI
నేటి సమాజంలో రోజుకి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి. అయితే ఎప్పుడూ ఆడవాళ్లే అన్యాయం అవుతున్న ఘటనలు చాలానే చూశాము. అందుకు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది.అయితే ఇప్పుడు మనము తెలుసుకోబోయే సంఘటనలో ఒక మగవాడు అందులోనూ ప్రజాప్రతినిధి ఒక మహిళపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు చూస్తే,
కర్ణాటక రాష్ట్రము కలబురిగి జిల్లా సేడం నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజకుమార్ పాటిల్ ఒక మహిళ తనకు వేధిస్తోందని కేసు పెట్టడం జరిగింది. అయితే ఇతను చెబుతున్న కథకు బీజం దాదాపు 13 సంవత్సరాల క్రితమే పడిందని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేకు 2009 లో ఈ మహిళా పరిచయం అయిందట. ఆ తర్వాత నాలుగేళ్ళకు ఎమ్మెల్యేను కలిసి ఒక భూ సమస్య ఉందని ఎలాగైనా సహాయం చేయమని కోరిందంట. అయితే అంతటితో ఆగకుండా 2018 లో సామజిక మాధ్యమాలను లక్ష్యంగా చేసుకుని ఆ ఎమ్మెల్యే గురించి తప్పుగా వివిధ పోస్ట్ లు పెట్టినట్లు ఆయన ఆ పిటిషన్ లో కోరారు. మరియు జాతీయ కమిషన్ లో ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించి ఇబ్బంది పెట్టినట్లు రాజకుమార్ పాటిల్ తెలిపారు.
అయితే ఇదంతా కూడా తన దగ్గర డబ్బు మరియు నగల కోసం చేసిందని పేర్కొన్నారు . వీటన్నింటికీ ఆయన ఎలా స్పందించారో తెలియదు కానీ ఇప్పుడు ఆ మహిళ వచ్చి నా బిడ్డకు తండ్రి ఎమ్మెల్యే అని చెబుతోందట. ఇక సమస్య ఎంత పెద్దది అయిందో తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే చెబుతున్న కథ. కానీ ఇందులో నిజం ఉందని ఆమ్ అదేమీ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. తనను కావాలనే మోసం చేసి ఇప్పుడు తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. అయితే ఈమె ఇప్పటికే తన బాధను సీఎం కు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? సీఎం ఎలా స్పందిస్తారు? 13 సంవత్సరాల ఈ బంధానికి సుఖంఠం ఎప్పుడు అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: