కేతిరెడ్డికి లక్కీ ఛాన్స్?

M N Amaleswara rao
రాజకీయంగా ఒకోసారి నాయకులకు ప్రత్యర్ధులే ప్లస్ అవుతారు..ప్రత్యర్ధులకు ఉన్న బలహీనతే...నాయకులకు బలం అవుతుంది. అప్పుడు రాజకీయంగా సక్సెస్ అవ్వడం నాయకులకు సులువు అవుతుంది. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సైతం ప్రత్యర్ధులే బలం అయ్యేలా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ధర్మవరం బరిలో గెలిచిన కేతిరెడ్డి..ఎమ్మెల్యేగా అదిరిపోయే పనితీరు కనబరుస్తూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే...ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడమే లక్ష్యంగా కేతిరెడ్డి పనిచేస్తున్నారు.
అయితే మొదట్లో కేతిరెడ్డి పనితీరుకు అంతా ఫిదా అయ్యారు...కానీ నిదానంగా ఆయన కెమెరాలు, మైక్‌లు పట్టుకుని డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు పెరిగిపోయాయి. ఏదో ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు మాదిరిగా కెమెరాలు వేసుకుని కేతిరెడ్డి జనాల్లోకి వెళ్ళి డ్రామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ఏదో కెమెరా ముందే హడావిడి అని, కెమెరా తీసేస్తే...ప్రజల సమస్యలని పట్టించుకోరని విమర్శించారు. ఈ విమర్శలు వల్ల కేతిరెడ్డికి కాస్త మైనస్ అవుతూ వచ్చింది.
ఇదే సమయంలో టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఓ వైపు కేతిరెడ్డిని టార్గెట్ చేసుకుని రాజకీయ విమర్శలు చేస్తూనే, మరోవైపు ధర్మవరంలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో ధర్మవరంలో కొద్దో గొప్పో టీడీపీకి ఊపు వచ్చింది. ఈ తరుణంలో బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
గతంలో ఈయన టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకోవాలని చూస్తున్నారు..అయితే ధర్మవరం సీటు తనదే అని పరిటాల అంటున్నారు...కాదు మా నేతకే సీటు దక్కుతుందని గోనుగుంట్ల అనుచరులు అంటున్నారు. అయితే ఇద్దరిలో ఎవరికి సీటు దక్కిన కేతిరెడ్డికి ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఒకరికి సీటు ఇస్తే..మరొక వర్గం సహకరించే పరిస్తితి లేదు..దీంతో టీడీపీకి నష్టం జరిగి...మళ్ళీ లక్కీగా కేతిరెడ్డి గెలిచిన గెలిచేయొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: