చిరు సన్నిహితులని టార్గెట్ చేసిన పవన్?

M N Amaleswara rao
రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే చిరంజీవి చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయనే సంగతి తెలిసిందే..ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి, రాజ్యసభ తీసుకుని, కేంద్ర మంత్రిగా పనిచేసి...చివరికి రాజకీయాలకు దండం పెట్టేసి..మళ్ళీ సినిమాల వైపు వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక సినిమాల్లో బిజీగా ఉంటున్న చిరంజీవి చుట్టూ ఎప్పుడు ఏదొక రాజకీయం అంశం తిరుగుతూనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఆయన..జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే కథనాలు ఎక్కువ వస్తున్నాయి.
ఇక ఈ అంశం జనసేన కార్యకర్తలకు బొత్తిగా నచ్చడం లేదు...అసలు పవన్ కల్యాణ్‌ని ఇష్టమొచ్చినట్లు తిట్టే పార్టీతో చిరంజీవి ఎలా సన్నిహితంగా ఉంటున్నారని చెప్పి జనసైనికులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో ఉంటూ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ, చిరంజీవితో సన్నిహితంగా ఉండే కొందరు నేతలకు చెక్ పెట్టాలని చెప్పి జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం అదే దిశగా ముందుకెళుతున్నారు...ముఖ్యంగా గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి, ఇప్పుడు వైసీపీలో ఉన్నవారికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు.


మొదటిగా మంత్రి కన్నబాబుకు చెక్ పెట్టాలని పవన్ చూస్తున్నారు...గతంలో కన్నబాబు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఆయన జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉంటూ, పవన్ కల్యాణ్‌పై ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. అటు వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు...ఆయన గతంలో ప్రజారాజ్యం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు...ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. వెల్లంపల్లి సైతం పవన్‌పై ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పక్కర్లేదు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్‌ది కూడా అదే బాట.  అందుకే ఈ మంత్రులని నెక్స్ట్ ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారు...కాకపోతే ఇక్కడ జనసేన ఒక్కటే, వారికి చెక్ పెట్టడం జరిగే పని కాదు...ఒకవేళ టీడీపీని గాని కలుపుకుంటే వారికి ఈజీగా చెక్ పెట్టొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: