అక్కడ ఫ్యాన్‌లో పొగలు..సైకిల్‌కు ఛాన్స్!

M N Amaleswara rao
రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీలో పొగలు రాని నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏమో సరిగ్గా చెప్పలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఎందుకంటే ఎక్కడొక చోట వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు...సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నేతల అసంతృప్తి సెగలు కామన్‌గానే ఉంటున్నాయి. ఇక పొగలు, సెగలు కర్నూలు జిల్లా పత్తికొండలో కూడా ఉన్నాయి. కర్నూలు జిల్లా టీడీపీలో కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు...అసలు కే‌ఈ రాజకీయంగా బలమైన నాయకుడు...ఆయనని ఢీకొట్టడం అనేది ప్రత్యర్ధులకు కాస్త కష్టమైన పని.
కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో..సీనియర్ లేరు..జూనియర్ లేరు..అందరు ఓడిపోయారు...జగన్ దెబ్బకు సైకిల్ నేతలు చిత్తుగా ఓడిపోయారు...అలాగే పత్తికొండలో కే‌ఈ కృష్ణమూర్తి వారసుడు శ్యామ్ బాబు సైతం చిత్తుగా ఓడిపోయారు. అనూహ్యాంగా శ్రీదేవి..వైసీపీ నుంచి విజయం సాధించారు...అయితే రాజకీయంగా శ్రీదేవికి పత్తికొండపై పెద్ద గ్రిప్ లేదు..ఏదో సీనియర్ నేతల బట్టే ఆమె రాజకీయం చేయాల్సిన పరిస్తితి.
అయితే గతంలో శ్రీదేవి భర్త నారాయణరెడ్డి హత్య చేయబడ్డారు..అది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. భర్త హత్యతో శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చి...జగన్ గాలిలో కే‌ఈ ఫ్యామిలీకి చెక్ పెట్టారు. ఏదో జగన్ గాలిలో గెలిచారు గాని..ఆమెకు పూర్తిగా పత్తికొండపై గ్రిప్ తక్కువ...అలాగే ఎమ్మెల్యేగా ఆమె పత్తికొండకు ఈ రెండున్నర ఏళ్లలో చేసింది కూడా పెద్దగా ఏమి లేదు.
పైగా ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి...ఓ వైపు ఎస్వీ సుబ్బారెడ్డి వర్గం, మరోవైపు పోచం మురళీధర్ రెడ్డి వర్గం ఉంది. సుబ్బారెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు...ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయిపోయినా సరే, ఆయన వర్గం వైసీపీలో చేరి, సెపరేట్‌గా రాజకీయం నడిపిస్తోంది. ఇటు మురళీధర్ వర్గం అదే పనిలో ఉంది. ఇక ఎమ్మెల్యే వర్గం ఎలాగో సెపరేట్‌గా ఉంది. ఇలా వర్గ రాజకీయంలో పత్తికొండలో ఫ్యాన్‌కు కాస్త ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే...పత్తికొండలో సైకిల్ గెలవడానికి ఛాన్స్ ఇచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: