చినబాబుని ఫిక్స్ చేసేశారుగా!

M N Amaleswara rao
చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు ఎవరు? అదేంటి ఇలాంటి ప్రశ్న అవసరం లేదు..అసలు చినబాబు ఉండగా తర్వాత నడిపించే నాయకుడు ఎవరు అనే ప్రశ్నలు లేవని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే చెప్పేస్తున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ వద్దని తాజాగా చినబాబు పుట్టిన రోజు నాడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా నారా లోకేష్ తమ భవిష్యత్ నాయకుడు అని తమ్ముళ్ళు ఫిక్స్ చేసేశారు. ఆఖరికి బుచ్చయ్య చౌదరీ లాంటి సీనియర్లు కూడా చినబాబునే తమ నాయకుడుగా ఫిక్స్ అయ్యే పరిస్తితి వచ్చింది.
అయితే గత ఎన్నికల నుంచి టీడీపీలో నాయకత్వం అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే..పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి...చంద్రబాబు పని అయిపోయిందని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు...వారి విమర్శలే కాదు సొంత పార్టీలో కొందరు నేతలకు కూడా బాబు నాయకత్వంపై అనుమానాలు వచ్చాయి. ఇంకా ఆయన పార్టీని నడపలేరని భావించారు.
ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు...లోకేష్‌ని తమ నాయకుడుగా భావించడం మొదలుపెట్టారు. అటు మరి కొందరేమో ఎన్టీఆర్‌ని ముందు పెట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులు కొందరు ఎన్టీఆర్ పేరుని బహిరంగంగానే తెరపైకి తీసుకొచ్చారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్ళీ దూకుడుగా ఉండటం చినబాబు కాదు, ఎన్టీఆర్ కాదు...తనకే పార్టీని నడిపించే సత్తా ఉందని మళ్ళీ రుజువు చేస్తూ, పార్టీని గాడిలో పెట్టారు. సరే చంద్రబాబు సత్తా మాత్రం తగ్గలేదనే అనుకోవచ్చు. కానీ ఎన్ని ఏళ్ళు? మరో 10 ఏళ్ళు గట్టిగా రాజకీయాలు చేయలగలరేమో...మరి తర్వాత పరిస్తితి ఏంటి? అంటే దానికి సమాధానంగా చినబాబు పుట్టిన రోజు కనిపిస్తుంది.
కింది స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నేత వరకు అందరూ...లోకేష్‌ని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే భవిష్యత్‌లో టీడీపీనే నడిపించే నాయకుడు లోకేష్ అన్నట్లు హింట్ ఇచ్చారు. మరి చూడాలి చినబాబు టీడీపీ అధినేత అవుతారో లేక...టీడీపీలో సైడ్ ఉండే నేత అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: