బైడెన్ నిర్ణయం.. ఆ కంపెనీ కి షాక్?

praveen
మొన్నటి వరకు ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది అమెరికాకు సంబంధించిన  టెస్లా కంపెనీ.  ఇక ఎప్పుడు వినూత్నమైన టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ కార్లు తీసుకువస్తూ ఒక రకంగా సంచలనమే సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మొన్నటి వరకు ఎలక్ట్రికల్ కార్ల తయారీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన టెస్లా గత కొంత కాలం నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంది. నాణ్యతకు  మారుపేరైన టెస్లా కార్లలో ఇటీవలి కాలంలో నాణ్యత లోపిస్తుంది అనేది అర్థం అవుతుంది.. దీంతో టెస్లా వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 ఎలక్ట్రికల్ కార్ల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న టెస్లా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రికల్ కార్లు ఎన్నో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది వినియోగదారులు టెస్లా కంపెనీ పై ఫిర్యాదు చేస్తూ ఉండడం ఇటీవల కాలం లో హాట్ టాపిక్ గా మారిపోయింది. టెస్లా కంపెనీ కార్లు కొనుగోలు చేసిన వారు కారు ఇంజన్ హీట్ అవ్వడం లాంటి సమస్య తలెత్తుతుంది అంటూ చెబుతున్నారు. ఇలాంటి సమస్య కారణంగా ఇటీవల అమెరికాలో ఏకంగా రెండుసార్లు అగ్నికి ఆహుతి గా మారిపోయాయి. ఇలా టెస్లా కార్ లో మంటలు చెలరేగడం ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది.

 ఈ క్రమంలోనే టెస్లాకు సంబంధించిన ఎలక్ట్రికల్ కారు నడుపుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోతుందని వినియోగదారులు తరచూ ఫిర్యాదు చేస్తూ ఉండటం గమనార్హం.. టెస్లా కారులో ప్రయాణం చేయడం ద్వారా వినియోగదారుల సేఫ్టీ కి భంగం కలిగే అవకాశం ఉంది ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే అమెరికా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకొని టెస్లా కంపెనీకి సమన్లు జారీ చేయడం గమనార్హం. టెస్లా కంపెనీ తయారు చేసిన కార్ లలో సాంకేతిక లోపం ఉందని దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలి అంటూ టెస్లా కంపెనీకి బైడెన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: