అనంత సైకిల్‌లో సీట్లు కోల్పోయేది వారేనా?

M N Amaleswara rao
కంచుకోట లాంటి అనంతపురంలో మళ్ళీ టీడీపీ పికప్ అవ్వాలంటే పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే చెప్పొచ్చు..రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీకి చెక్ పెట్టి కంచుకోటని మళ్ళీ కైవసం చేసుకోవాలంటే కంచుకోటలో పలు మార్పులు జరగాలి. ఇక ఆ మార్పులు చేయడానికి చంద్రబాబు కూడా రెడీగానే ఉన్నారని తెలుస్తోంది...పలు సీట్లలో మాత్రం నాయకులని మార్చడానికి బాబు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఈ సారి అనంతలో సైకిల్ సవారి జరగాలంటే...కొందరు నాయకులని సైడ్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే ముందుగా అనంతలో  కొందరు టీడీపీ నేతలకు సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు. మొదట సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న బాలయ్య, పయ్యావుల కేశవ్‌లకు సీట్లు ఫిక్స్. బాలయ్య..హిందూపురంలో, కేశవ్..ఉరవకొండలో పోటీకి దిగుతారు. అలాగే కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్, పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, గుంతకల్లులో జితేంద్ర గౌడ్, అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరీలు పోటీ చేయడం ఖాయం.


రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ, తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ బరిలో దిగడం కూడా ఫిక్స్. కాకపోతే ఎవరు బరిలో దిగుతారనేది ఇంకా క్లారిటీ లేదు. అటు మడకశిర సీటులో మాజీ ఎమ్మెల్యే ఈరన్న పోటీ చేస్తారా లేక మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.  ధర్మవరం సీటు తనదే అని పరిటాల శ్రీరామ్ అంటున్నారు...అటు తమ నేతకే సీటు దక్కుతుందని బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అనుచరులు చెబుతున్నారు. ఈయన టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటులో పోటీ చేస్తారని అంటున్నారు.
ఇక శింగనమలలో ఇంచార్జ్‌గా బండారు శ్రావణి ఉన్నారు...కానీ అప్పుడప్పుడు ఆమె యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ సీటు కోసం టీడీపీ యువ నేత ఎం‌ఎస్ రాజు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికైతే అనంత సైకిల్‌లో కొందరు నేతలు మాత్రం సీట్లు కోల్పోతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: