రాజ్యసభ : వైసీపీ పెద్దలు వీరే! అరే సాంబూ రాస్కోరా!

RATNA KISHORE
వ‌చ్చే జూన్ లో పెద్దల స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.వీటిలో నాలుగు సీట్లు ఏపీకి ఖాయం కాగా, రెండు సీట్లు తెలంగాణ‌కు చెంది ఉన్నాయి.అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణ‌లోనూ మంచి మెజార్టీతో ఉన్నవి అధికార పార్టీలే క‌నుక ఈ సారి ఆయా అధినాయ‌క‌త్వాలు త‌మ‌కు చెందిన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాయి.ముఖ్యంగా వైసీపీకి సంబంధించి మొద‌ట్నుంచి ఒక రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన ప్ర‌తినిధిని ఫిక్స్ చేసి ఉంచింది.దీంతో నాలుగు సీట్ల‌లో ఒక‌టి సాయి రెడ్డికి క‌న్ఫం. వాస్త‌వానికి తాజాగా మాజీలు కాబోతున్న వారిలో సాయిరెడ్డి ఒకరు.ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగియ‌నుండ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న‌కే పెద్దల స‌భ‌లో చోటివ్వ‌డం త‌థ్యం.అయితే ఈ సీటుకు వైవీ సుబ్బారెడ్డి కూడాపోటీ ప‌డుతున్నారు.ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కూడా ఆశావ‌హుల జాబితాలో ఉన్నారు.

మ‌రి!ఈ ముగ్గురిలో ఎవ‌రికి సీటు వ‌స్తుందో అన్న సందేహం ఒక‌టి వెన్నాడుతున్నా, ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం సాయిరెడ్డి అభ్య‌ర్థిత్వం అయితే ఫిక్స్.కానీ అనూహ్య ప‌రిణామాలు జ‌రిగితే త‌ప్ప పెద్దాయన (వైవీ) ఆశ‌లు నెర‌వేర‌వు.టీటీడీ బోర్డు చైర్మ‌న్ గా ఉన్న ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి పెద్ద‌గా న‌చ్చ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం.కాద‌న‌లేని నిజం కూడా! ఇదే స‌మ‌యంలో ఆ స్థానం మ‌రొక‌రితో భర్తీ చేయించి త‌న‌కు రాజ్య స‌భ సీటు ఇవ్వాల‌ని ఏనాటి నుంచో స్వామిని మ‌రియు జ‌గ‌న్ ను ఏక కాలంలో వేడుకుంటున్నారు.మ‌రి! ఆయ‌న కోరిక నేర‌వేరనుందో లేదో?
ఇక మ‌రో స్థానం కిల్లి కృపారాణికి ఖాయం.శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత‌గా ఆమెకు మంచి పేరుంది.ఆమెకు ఎప్ప‌టి నుంచో ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు క‌నుక త‌న మాట ప్ర‌కారం కిల్లి కృపారాణికి ప‌ద‌వీ యోగం ద‌క్కించ‌డం ఖాయం.మ‌రో రెండు స్థానాల‌కు సంబంధించి ఒక మైనార్టీ వ‌ర్గానికి చెందిన నేత‌కు ఛాన్స్ ఉంది.ఇది కూడా ఫిక్స్ కాలేదు కానీ వివిధ ప్ర‌తిపాద‌న‌లు అయితే ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇక మ‌రో సీటు సురేశ్ ప్ర‌భు కు కేటాయించ‌నున్నారు.ఆయ‌న ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌డంతో ఏపీ నుంచే ఆయ‌న‌ను నామినేట్ చేయించాల‌ని బీజేపీ యోచిస్తోంది. అదే గ‌నుక జ‌రిగితే బీజేపీ,వైసీపీ బంధం బ‌ల‌పడిందనే చెప్ప‌వ‌చ్చు. నిర్థార‌ణ చేయ‌వ‌చ్చు కూడా! ఇక ముందు చెప్పుకున్న విధంగా మైనార్టీలకు కేటాయించే రాజ్య స‌భ సీటు విష‌య‌మై ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. ఇదే సీటుకు కొన్ని ద‌ళిత వ‌ర్గాలకు చెందిన నేత‌ల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇదే ద‌శ‌లో మ‌రో చిన్న ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఏంటంటే కిల్లి కృపారాణి కి కూడా ఆమె సొంత జిల్లా నుంచే గ‌ట్టి పోటీ నెల‌కొని ఉంది. స్పీక‌ర్ సీతారాం కూడా పార్ల‌మెంట్ రాజ‌కీయాల్లోఅడుగు పెట్టాల‌ని చూస్తున్నారు.ఆయ‌న‌కూ రాజ్య స‌భ సీటుపై ప్రేమ ఉంది.ఒకే సామాజిక‌వర్గంకు చెందిన ఇద్ద‌రు నేత‌లు ఒకే సీటు కోసం పోటీ ప‌డ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేక‌పోయినా సీతారాం ఆశ‌లు అయితే నెర‌వేరవు గాక నెర‌వేరవు.

ఇదే స‌మ‌యంలో మ‌రో అప్టేడ్ ఏంటంటే కాపు సామాజిక‌వ‌ర్గం ప‌రంగా చూస్తే ముద్ర‌గ‌డ ను కానీ చిరంజీవిని కానీ రాజ్య‌స‌భ‌కు పంపే ఛాన్స్ ను కూడా కొట్టి పారేయ‌లేం.ముద్ర‌గ‌డ‌తో కొత్త‌గా ఓ పార్టీ పెట్టించే యోచ‌న‌లో  ఉన్నారు జ‌గ‌న్.అది నెర‌వేరకపోతే వీలున్నంత మేర‌కు  ముద్ర‌గ‌డ‌కు మంచి స్థానం ఇచ్చేందుకు,స‌ముచిత స్థాయిలో రాజ్యాధికారం ద‌క్కించేందుకు జ‌గ‌న్ యోచిస్తున్నారు.త‌ద్వారా కాపు సామాజిక‌వ‌ర్గంను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ముఖ్య‌మంత్రి త‌న‌దైన పావులు క‌దుపుతున్నార‌ని ప్రాథ‌మిక స‌మాచారం.ఇదే స‌మ‌యంలో చిరంజీవి పేరును కూడా రాజ్య‌స‌భ పోరులో  ఉంచారు. ఇప్ప‌టికిప్పుడు ఇవేవీ నిర్థార‌ణ‌లోకి రాక‌పోయినా చిరుకు రాజ యోగం ద‌క్కించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం.అదేమంత సులువు కాదు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో!

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: